ఇటీవలి కాలంలో సరైన సక్సెస్‌లేక డీలాపడిన 'క్రాక్' సినిమాతో ట్రాక్ ఎక్కేశారు. మాస్ మహారాజ్ గత సినిమాల్లో 'రాజా ది గ్రేట్' తర్వాత ''టచ్ చేసి చూడు, నేల టిక్కెట్టు, అమర్ అక్బర్ ఆంటోనీ, డిస్కో రాజా'' వంటి సినిమాలు ఆశించిన స్థాయి రిజల్ట్ రాబట్టకపోవడంతో ఆయన మార్కెట్ ఒక్కసారిగా పడిపోయింది. దీంతో ఈ 'క్రాక్'తోనైనా తిరిగి రవితేజ సత్తా చాటుతాడా? అని ఎదురుచూసిన ఆయన అభిమానులకు క్రాకింగ్ రిజల్ట్ ఇచ్చి బాక్సాఫీస్ దుమ్ముదులుపుతున్నారు రవితేజ. 'షూర్ షాట్.. నో డౌట్.. పుచ్చ పేలిపోద్ది' అంటూ మాస్ డైలాగ్‌తో విడుదలకు ముందే ట్రెండ్ సృష్టించిన రవితేజ.. అన్నంతపని చేసి చూపిస్తున్నారు. జనవరి 9న ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'క్రాక్' తొలి రోజే షాక్ తగిలింది. ఆర్థిక వివాదాల వల్ల రెండు షోలు క్యాన్సిల్ అయి సాయంత్రం ఫస్ట్ షో నుంచి 'క్రాక్' సందడి మొదలైంది. అలా మొదలైన మాస్ మహారాజ్ జర్నీ నేటికీ ఫ్లో తగ్గకుండాగే సాగిపోతోంది. కలెక్షన్స్ పరంగా భేష్ అనిపించుకుంటున్న క్రాక్ మూవీ లాభాల బాటలో పయనిస్తోంది. విడుదలై 16 రోజులు గడిచినా క్రాక్ థియేటర్స్ వద్ద జనం కోలాహలం అలాగే కనిపిస్తుండటం ఈ సినిమా పెద్ద హిట్ అని చెప్పడానికి నిదర్శనం. 17.5 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బరిలోకి దిగిన క్రాక్ మూవీ మొత్తం 16 రోజుల్లో దాదాపు 34 కోట్ల మేర షేర్ రాబట్టి 16 కోట్ల వరకు ప్రాఫిట్ పొందింది. అంతేకాదండోయ్ 50 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు నమోదు చేసి రవితేజ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. దీంతో మాస్ మహారాజ్ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. ఈ హవా చూస్తుంటే థియేటర్ల వద్ద 'క్రాక్' జోష్ మరికొన్ని రోజులు కనిపించే అవకాశం ఉందని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2YfduwA
No comments:
Post a Comment