Saturday, 2 January 2021

Krack: రవితేజ కెరీర్‌లో బిగ్గెస్ట్ ఫీట్.. సూపర్ ఫామ్‌లో ఉన్న మాస్ మహారాజ్

మాస్ ఆడియన్స్ పల్స్ బాగా తెలిసిన తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఫీట్ సాధించారు. ఇటీవలి కాలంలో సరైన సక్సెస్ లేక డీలాపడిన ఆయన తాజాగా 'క్రాక్' సినిమాతో మరోసారి తన సత్తా బయటపెట్టేలా కనిపిస్తున్నారు. రవితేజ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన ‘క్రాక్’ ట్రైలర్ నిన్న(శుక్రవారం) విడుదలై సోషల్ మీడియాలో దుమ్ముదులుపుతోంది. యూట్యూబ్‌లో టాప్ ట్రెండింగ్ వీడియోగా నిలవడమే గాక రవితేజ ఖాతాలో సరికొత్త రికార్డు నమోదు చేసింది. హై ఓల్టేజ్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందిన క్రాక్ మూవీ అప్‌డేట్స్ ఒక్కటిగా రిలీజ్ చేస్తూ సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేశారు మేకర్స్. ఈ క్రమంలోనే విడుదలైన ప్రేక్షకుల నుంచి విశేష స్పందన తెచ్చుకుంటూ వేగంగా వ్యూస్ రాబడుతోంది. న్యూ ఇయ‌ర్ కానుక‌గా విడుదలైన ఈ ట్రైలర్ కేవలం 24 గంటల్లోనే 7 మిలియన్ వ్యూస్ రాబట్టడం విశేషం. అంతేకాదు 2 లక్షల మేర లైక్స్ సాధించి రవితేజ కెరీర్ లోనే సాలిడ్ రీచ్ అందుకున్న ట్రైలర్‌గా నిలిచింది. దీంతో ఈ సారి హిట్ పక్కా అంటూ ఖుషీ అవుతున్నారు ఆయన ఫ్యాన్స్. సరస్వతి ఫిలింస్ డివిజన్ బ్యానర్‌పై బి.మధు నిర్మించిన ఈ సినిమాకు గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించారు. రవితేజ సరసన శృతి హాసన్ హీరోయిన్‌గా నటించగా.. స‌ముద్రఖని, వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్‌కుమార్ కీలక పాత్రలు పోషించారు. ఇందులో రవితేజ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన సాంగ్స్, థమన్ బాణీలు ప్రేక్షకలోకాన్ని కట్టిపడేశాయి. దీంతో జనవరి 9వ తేదీన విడుదల కాబోతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3hAR8y7

No comments:

Post a Comment

'Don't Think US Will Cut Off Ties With UN'

'Decline of the UN did not start with the Trump administration. It has been happening over the last two decades or more.' from red...