
తమిళ హీరో వైవిధ్యమైన చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. మిగిలిన హీరోలకు భిన్నంగా ప్రయోగాత్మక సినిమాలు చేస్తూ తనకంటూ ప్రత్యేకమైన అభిమానగణాన్ని సంపాదించుకున్నారు. తాను చేసే వైవిధ్యమైన పాత్రల కోసం సూర్య ఎంత కష్టపడతారో.. తన అభిమానులకు కూడా అంతే విలువ ఇస్తారు. అభిమానులు కష్టాల్లో ఉంటే వాళ్లకు అండగా ఉంటారు. వారి పిల్లలను తన ఆర్గనైజేషన్‌లో చదిస్తున్నారు. ఎంతో మంది పేద పిల్లలను చదివిస్తున్నారు. అందుకే, సూర్య అంటే తమిళనాడులో చాలా మందికి అభిమానం. ఇదిలా ఉంటే, సూర్య తాజాగా తన అభిమాని హరి పెళ్లి వేడుకలో పాల్గొన్నారు. నిన్న (జనవరి 25న) చెన్నైలో జరిగిన ఈ పెళ్లి వేడుకలో పాల్గొని నూతన వధూవరులు హరి, ప్రియలను ఆశీర్వదించారు. పెళ్లికుమారుడు హరి కోరిక మేరకు తాళిబొట్టు తన చేతులతో అతనికి అందించారు సూర్య. పెళ్లి తంతు మొత్తాన్ని అక్కడే ఉండి వీక్షించారు. ఆ తరవాత నవ దంపతుల వద్ద కూర్చొని ఫొటోలకు పోజులిచ్చారు. ఈ సమయంలో తన చేయిని హరి భుజంపై వేశారు. ఇదంతా చూసిన సూర్య అభిమానులు ‘మా హీరో అంటే ఇది’ అంటూ మురిసిపోతున్నారు. నిన్నటి నుంచి ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అలాగే, ఈ ఫొటోల్లో సూర్య లుక్ కూడా వైరల్ అవుతోంది. ఇక సూర్య సినిమాల విషయానికి వస్తే లాక్‌డౌన్ సమయంలో ‘ఆకాశం నీ హద్దురా!’ చిత్రంతో ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు సూర్య. ప్రస్తుతం పాండిరాజ్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. ఇది సూర్య 40వ చిత్రం. ఇంకా టైటిల్ ఖరారు చేయలేదు. అలాగే, వెట్రిమారన్ దర్శకత్వంలో ‘వాడివసల్’ అనే సినిమా కూడా చేయనున్నారు సూర్య.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3pm31en
No comments:
Post a Comment