శాతాధిక చిత్రాల దర్శకుడు, దర్శకేంద్రుడు సినీ ప్రస్థానం గురించి చెప్పుకుంటూ పోతే ఎన్నో విషయాలు తారసపడతాయి. వీటిలో ముఖ్యంగా రాఘవేంద్రుడికే సొంతమైన ప్రత్యేకమైన శైలి ఒకటుంది. అదే ఎంతో రొమాంటిక్‌గా హీరోయిన్ బొడ్డుపై పండు విసరడం. ఆయన 45 ఏళ్ల సినీ ప్రస్థానంలో ఈ ప్రత్యేకత మాత్రం ఆ నాటి నుంచి నేటి వరకు అన్ని వర్గాల ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఆయన రూపొందిస్తున్న ప్రతి సినిమాలో ఈ సీన్ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తుంటుంది ప్రేక్షకలోకం. మరి ఈ రాఘవేంద్రుడు మొదట ఏ హీరోయిన్‌తో ఈ ప్రత్యేక ప్రయాణం మొదలు పెట్టారో చూద్దామా.. ఓ హీరోయిన్ బొడ్డుపై ద్రాక్ష పండు, మరో హీరోయిన్ నాభిపై యాపిల్ పండు, ఇంకో హీరోయిన్ నడుమందాలపై బత్తాయి పండు.. ఇలా ప్రకృతి ప్రసాదించిన పండ్లకు కొత్త శోభ తీసుకొస్తూ తన సినిమాల్లోని పాటల కోసం వినియోగించే దర్శకేంద్రుడికి మొదట ఈ ఆలోచన హీరోగా వచ్చిన 'మంచిదొంగ' సినిమా సమయంలో వచ్చింది. చిరంజీవి, విజయశాంతి, సుహాసిని లీడ్ రోల్స్ పోషించిన ఈ సినిమాలో ''బెడ్ లైటు తగ్గించనా'' అనే రొమాంటిక్ సాంగ్ ప్రత్యేకంగా చిత్రీకరించాలనే కోణంలో మొదటిసారి పూలు, పండ్లు ఉపయోగించారు. అలా బొడ్డుపై రాఘవేంద్రుడి తొలిపండు పడింది. ఇది ఫస్ట్ నైట్ సాంగ్ కావడంతో సూపర్‌గా సూట్ అయింది. అక్కడ మొదలైన ఆ ఆనవాయితీ నేటికీ అలా కొనసాగుతూనే ఉంది. Also Read: ‘బాబు’ చిత్రంతో దర్శకుడిగా పరిచయమైన రాఘవేంద్ర రావు ప్రస్తుతం మోడ్రన్ 'పెళ్లి సందడి'పై ఫోకస్ పెట్టారు. 'పెళ్లి సందడి మళ్ళీ మొదలవ్వబోతుంది' అంటూ ఇటీవలే ఆయన చేసిన ప్రకటన ప్రేక్షకులను హుషారెత్తించింది. 25 ఏళ్ల క్రింద అనగా 1996లో 'పెళ్లి సందడి' సినిమా సృష్టించిన హంగామాను మించి ఉండేలా ఈ మూవీ ప్లాన్ చేస్తున్నారు. ఈ నయా పెళ్లి సందడి శ్రీకాంత్ కొడుకు రోషన్ హీరోగా నటించబోతున్నాడు.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3rMuWWz
No comments:
Post a Comment