Tuesday 26 January 2021

'అర్ధ శతాబ్దం' టీజర్: న్యాయం ధర్మం అవుతుంది గానీ ధర్మం ఎల్లప్పుడూ న్యాయం కాదు!!

కెరీర్ పరంగా విలక్షణ పాత్రలు ఎంచుకుంటూ ముందుకు సాగుతున్న నటుడు ఈ సారి 'అర్ధ శతాబ్దం' అంటూ మరో వైవిద్యభరితమైన కథాంశంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. నవీన్ చంద్ర హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో శుభలేఖ సుధాకర్, సాయి కుమార్ వంటి దిగ్గజ నటులు భాగస్వామ్యం పంచుకోవడం విశేషం. గత కొన్ని రోజులుగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. రిషిత శ్రీ క్రియేషన్స్ పతాకంపై రూపొందుతున్న ఈ సినిమాకు చిట్టి కిరణ్ రామోజు నిర్మాతగా వ్యవహరిస్తుండగా రవీంద్ర పుల్లే దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రంలో నవీన్ చంద్ర పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ రోల్ పోషిస్తున్నాడు. కార్తిక్ రత్నం, కృష్ణప్రియ ముఖ్యపాత్రలు పోషిస్తుండగా.. అజయ్, ఆమని, పవిత్ర లోకేష్, శరణ్య ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇటీవ‌ల దగ్గుబాటి రానా ఈ మూవీ ఫ‌స్ట్ గ్లింప్స్‌ రిలీజ్ చేయగా, తాజాగా గణతంత్ర దినోత్సవం సందర్భంగా చిత్ర టీజర్ విడుదల చేశారు. ఒక నిమిషం ఏడు సెకనుల నిడివితో కూడిన ఈ టీజర్‌లో చూపించిన అన్ని సన్నివేశాలు, ముఖ్యంగా రోమాలు నిక్కబొడిచేలా ఉన్న డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి. ''న్యాయం ధర్మం అవుతుంది గానీ ధర్మం ఎల్లప్పుడూ న్యాయం కాదు.. యుద్ధమే ధర్మం కానప్పుడు ధర్మ యుద్ధాలెక్కడివి. ఈ స్వతంత్ర దేశంలో గణతంత్రం ఎవడికో, ఎందుకో, దేనికో.. ఈ విశాల భారతానికి అఖండ రాజ్యాంగం'' అనే డైలాగ్స్ ఈ టీజర్‌లో వినొచ్చు. మొత్తంగా ఈ టీజర్ చూస్తుంటే నవీన్ చంద్ర కెరీర్‌కి ఈ 'అర్ధ శతాబ్దం' సినిమా బాగానే ప్లస్ అయ్యేలా కనిపిస్తోంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ మూవీ అతిత్వరలో విడుదల కానుంది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3pmg8MG

No comments:

Post a Comment

'Don't Involve My Family!'

'My weakness is my family, and the people I love.' from rediff Top Interviews https://ift.tt/2lOucDz