కమెడియన్‌గా అనేక చిత్రాల్లో నటించి.. వైసీపీ తీర్థం పుచ్చుకుని ఎస్వీబీసీ చైర్మన్‌గా కీలక బాధ్యలు చేపట్టారు థర్టీ ఇయర్ ఇండస్ట్రీ . అయితే ఓ మహిళతో ఆడియో కాల్ ఇష్యూతో తన పదవిని పోగొట్టుకున్నారాయ. ఈ ఇష్యూతో హాట్ టాపిక్ అయ్యి దారుణంగా ట్రోలింగ్‌కి గురయ్యారు పృథ్వీ. అయితే ఈ ఇష్యూతో తీవ్ర మనోవేదనకు గురైన ఆయన.. ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నట్టు తెలిపారు. తాజాగా ఎన్టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు. ‘నాపై చేసిన తప్పుడు ప్రచారానికి చాలా స్ట్రగుల్ అయ్యాను. మహిళతో ఫోన్ కాల్ అంటూ కథలు అల్లి నన్ను అన్నింటికీ దూరం చేశారు. నాపై వచ్చిన ఆరోపణలకు ప్రెస్ క్లబ్‌లో సమాధానం ఇచ్చేసి.. ఆత్మహత్య చేసుకుని చనిపోదాం అనుకున్నా. ఏడాదిన్నరగా తాగడం మానేశా.. కానీ నాపై వచ్చిన ఆరోపణలకు ఆ ముందులో పురుగుల మందు కలుపుకుని చనిపోదాం అనుకున్నా. ఆ మూడు నెలలు నరకం అనుభవించా. ఆ టైంలో కూడా మా కార్యకర్తలు ఎవరూ పలకరించలేదు. చనిపోయినా పలకరించే వారు కాదు. నేను వాళ్ల ఆస్తులు కొట్టేయలేదు. నేను పార్టీలో ఉన్నప్పుడు నా ఏజ్ వాళ్లకి కూడా చాలా గౌరవం ఇచ్చేవాడ్ని. నాకంటే మంచి స్థానంలో ఉన్నారని నమస్కారం పెట్టేవాడిని. అలా నమస్కారం పెట్టినా అవతల నుంచి రియాక్షన్ ఉండేది కాదు. నా నాలుకపై మచ్చ ఉండేది.. మా అమ్మ అనేది నువ్ నీ కోసం ఏమైనా అనుకుంటే జరగదు.. కానీ ఎవరి కోసమైనా అనుకుంటే జరిగిపోద్ది.. ఎవర్నీ ఏమీ అనొద్దు అనేది. నా నాలుకకి అంత పవర్ ఉంది. వాడు ఉండడు అంటే ఖచ్చితంగా పోతాడు. నేను పడ్డ క్షోభ నా శత్రువు కూడా పడకూడదు. వెంకటేశ్వరుడి లీలలు మనకి తెలియవు.. ఆయన్ని ఎవరు ఎక్కువగా కొలుస్తారో వారికి ఎక్కువ కష్టాలు వస్తాయని.. అరుణాచలంలో ఒక స్వామి చెప్పారు. కానీ ఏదో ఒకరోజు స్వామి మనల్ని కనుకరిస్తారు. నేను మంత్రి అయిపోవాలి.. ముఖ్యమంత్రి అయిపోవాలి.. జనాల్ని దోచేయాలని అనుకుంటే చివరికి మట్టిలోనే కలిసిపోతారు. ఇలాంటివి చాలా చూశాను. శ్రీక్రిష్ణుడు అంతటి వాడికే నిందలు తప్పలేదు నేను ఓ లెక్కా అంటూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు పృథ్వీ. Read Also: Read Also:
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3pGn86N
No comments:
Post a Comment