Tuesday 26 January 2021

‘యాత్ర’ దర్శకుడితో అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ మల్టీస్టారర్!

తెలుగు సినిమా పరిశ్రమలో మల్టీస్టారర్లు కొత్తేమీ కాదు. 70లు, 80ల్లో ఇదే సినిమాల్లో సక్సెస్‌ఫుల్ ఫార్ములా. ఎన్టీఆర్-ఏఎన్నార్ టైమ్ నుంచే ఇద్దరు హీరోల ట్రెండ్ మొదలైంది. ఆ తరవాత కృష్ణ, కృష్ణంరాజు, శోభన్‌బాబు లాంటి స్టార్ హీరోలు ఆ ట్రెండ్‌ను కొనసాగించారు. మధ్యలో కొన్నేళ్లు మల్టీస్టారర్ మూవీస్ కనిపించలేదు. కానీ, ఇప్పుడు మళ్లీ ఆ ట్రెండ్ మొదలైంది. ఇప్పటికే కొంత మంది స్టార్ హీరోలు చేసిన మల్టీస్టారర్‌లు విజయాలను అందుకున్నాయి. ఇదిలా ఉంటే, టాలీవుడ్‌లో మరో క్రేజీ మల్టీస్టారర్ రాబోతుందనే ప్రచారం ఊపందుకుంది. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ కలిసి ఒక మల్టీస్టారర్ చేయబోతున్నారని ప్రచారం జరుగుతోంది. ‘ఆనందో బ్రహ్మ’, ‘యాత్ర’ చిత్రాల దర్శకుడు మహి వి రాఘవ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారని అంటున్నారు. అంతేకాదు, ఈ భారీ చిత్రాన్ని మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పించనున్నారట. మరో ప్రముఖ నిర్మాణ సంస్థతో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారని టాక్. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వస్తుందంటున్నారు. నిజానికి బన్నీ, విజయ్‌ల మధ్య మంచి రాపో ఉంది. గీతా ఆర్ట్స్ బ్యానర్‌లో విజయ్ దేవరకొండ ‘గీత గోవిందం’ సినిమా చేసిన తరవాత బన్నీ, విజయ్‌ల మధ్య సాన్నిహిత్యం పెరిగింది. బన్నీ అన్న అంటూ ఆప్యాయంగా పిలిచే విజయ్.. ఆయనకు రౌడీ బ్రాండ్ బట్టలు కూడా పంపిస్తుంటారు. మరి ఇలాంటి ఇద్దరు హీరోలు కలిసి నటిస్తే సిల్వర్ స్క్రీన్ షేక్ అయిపోవడం ఖాయం. మరోవైపు, విజయ్ దేవరకొండ ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ‘లైగర్’ అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే ఈ సినిమాలో విజయ్ సరసన నటిస్తున్నారు. ఈ చిత్రంతో విజయ్ దేవరకొండ బాలీవుడ్‌కు కూడా పరిచయమవుతున్నారు. అలాగే, అల్లు అర్జున్ సుకుమార్ దర్శకత్వంలో ‘పుష్ప’ సినిమా చేస్తున్నారు. ఈ చిత్రంలో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన నటిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2Mn42oa

No comments:

Post a Comment

'Rupee best-performing Asian currency this year'

'India represents one of the top opportunities with robust growth, solid fundamentals, and openness to foreign investment.' from r...