మెగాస్టార్ 152వ సినిమాగా రాబోతున్న '' మూవీ విడుదలకు ముందే సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. డైరెక్టర్ కొరటాల శివ ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు. సినిమా షూటింగ్‌కి సంబంధించిన అన్ని అప్‌డేట్స్ మెగా అభిమానుల్లో ఆతృతను పెంచేస్తున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్ నగర శివారులోని కోకాపేటలో షూటింగ్ చేస్తున్న కొరటాల.. అక్కడ ఓ భారీ సెట్ వేశారు. టెంపుల్ టౌన్‌గా వేసిన ఇంత పెద్ద సెట్ ఇప్పటిదాకా ఏ డైరెక్టర్ వేయలేదని, ఇది ఇండియా లోనే ది గ్రేట్ సెట్ అని అంటున్నారు. దాదాపు 20 ఎకరాల్లో నిర్మించిన ఈ భారీ సెట్‌లో చిత్రంలోని కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుపుతున్నారు. ఇన్ని ఎకరాల్లో ఇంత భారీగా టెంపుల్ టౌన్ సెట్ వేయడం మన దేశంలో ఇదే తొలిసారి కావడంతో ఆ రికార్డు 'ఆచార్య' ఖాతాలో పడింది. జనవరి 10వ తేదీతో చిరంజీవితో చేస్తున్న సోలో సన్నివేశాల చిత్రీకరణ పూర్తికానుంది. ఆ వెంటనే కాజల్, , ఇతర తారాగణంపై కీలక సన్నివేశాల చిత్రీకరణ పూర్తిచేయాలనేది కొరటాల ప్లాన్. ప్రస్తుతం రామ్ చరణ్ బారినపడి క్వారంటైన్‌లో ఉన్న సంగతి తెలిసిందే. కరోనా నుంచి కోలుకున్న వెంటనే ఆయన సెట్స్ పైకి వస్తారట. దాదాపు 30 రోజుల పాటు చెర్రీ చిత్రీకరణ ఉంటుందని సమాచారం. అలాగే చిరంజీవి, రామ్ చరణ్‌లపై ఓ సాంగ్ షూట్ కూడా చేయబోతున్నారట కొరటాల శివ. త్వరత్వరగా ఈ షూటింగ్ మొత్తం ఫినిష్ చేసి ఈ వేసవిలో 'ఆచార్య' చిత్రాన్ని రిలీజ్ చేయాలని సన్నాహాలు చేస్తున్నారు దర్శకనిర్మాతలు. మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్, కొణిదెల ప్రొడెక్షన్ కంపెనీ సంయుక్తంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాను దేవాలయాల్లో జరుగుతున్న అవినీతి నేపథ్యంలో రూపొందిస్తున్నారు. ఈ మెగా మూవీపై అభిమానుల్లో లెక్కకట్టలేనన్ని అంచనాలున్నాయి.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2WZbB6u
No comments:
Post a Comment