Wednesday, 24 June 2020

Hyper Aadi: నాడు సునీల్ ముందు నేను రిక్షావాలా.. తర్వాత అదే సునీల్‌తో..: హైపర్ ఆది

లాక్ డౌన్ సడలింపులతో జోరు ఊపందుకున్న సంగతి తెలిసిందే. ప్రోమోలు కూడా రిలీజ్ కావడంతో.. కామెడీ లవర్స్ పండుగచేసుకుంటున్నారు. అయితే.. ఈ జోరులో జబర్దస్త్ కమీడియన్స్ ఇంటర్వ్యూస్ కూడా యూట్యూబ్‌లో వైరల్ అవుతున్నాయి. గతంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్ స్టార్టింగ్ విషయాలు షేర్ చేసుకున్నారు. దాంతో ఆ ఇంటర్వ్యూ ప్రస్తుతం వైరల్ అవుతోంది. నాకు చిన్నప్పటి నుంచి స్క్రీన్ మీద కనిపించాలనే డ్రీమ్స్ ఏం లేవు. నాకు బిటెక్ అయిపోయి 1 ఇయర్ జాబ్ చేసిన తర్వాత ఇటుసైడ్ వచ్చాను. జబర్దస్త్ అప్పట్లో ఎక్కువ ఇంట్రెస్ట్‌గా జాబ్ చేసేప్పుడు ల్యాప్ టాప్‌లో చూస్తూ ఉండేవాళ్లం. హైదరాబాద్ వచ్చాక వాళ్లు ఎక్కడుంటారో తెలుసుకోవాలి.. చూడాలనే చిన్న ఆత్రుత ఉండేది. అయితే నేను చేసిన ఒక చిన్న షార్ట్ ఫిలిమ్‌కి అదిరే అభి ‘బాగుంది బ్రదర్.. ఒకసారి కలువు’ అని ఒక మెసేజ్ పెట్టాడు. అయితే అన్న దేని గురించి మాట్లాడతాడు అనేదానికన్నా ఫస్ట్ వాళ్లందరినీ చూడాలన్న ఆత్రుతతో మెసేజ్ పెట్టగానే వెళ్లి అక్కడున్న టీమ్ లీడర్ దగ్గర నుంచి కంటెస్టెంట్స్ వరకూ అందరితో ఫోటోస్ దిగేశాను ఫస్ట్. వాళ్లందరితో ఫోటోస్ దిగి ఫేస్ బుక్‌లో పెట్టేశాను. అప్పటి దాక ఒక లైక్, రెండు లైక్స్ వచ్చే నాకు... జబర్దస్త్ వాళ్లతో ఫోటో పెట్టగానే.. రెండొందల లైక్స్, మూడొందల లైక్స్.. ఇలా పెరగడంతో.. నాకు ఆలోచన వచ్చింది. ఫోటో పెడితేనే ఇన్ని లైక్స్ వస్తే.. మనం కూడా ఒకసారి టీవీలో కనిపిస్తే.. ఇంకెంత రెస్పాన్స్ వస్తుందో కదా అని.. అప్పుడు కలిగింది నాకు. దాంతో అభి అన్న నంబర్ ఉంది కాబట్టి అభి అన్నకి రోజు మెసేజ్ పెట్టేవాడ్ని. అన్నా మీ స్కిట్‌లో ఏదైనా చూడండి అన్నా.. మీ స్కిట్ సూపర్ అన్నా.. మీ స్కిట్‌లో నాకు ఏదైనా ఛాన్స్ ఇవ్వండి అన్నా.. ఇలా మెసేజ్‌లు చేసేవాడ్ని. దాంతో అభి అన్న గుర్తు పెట్టుకుని నన్ను ఓ సారి పిలిపించారు. అప్పుడే గారు జబర్దస్త్‌కి గెస్ట్‌గా వచ్చారు. కనిపించాలనే ఆత్రుత కాబట్టి.. అప్పుడు నా క్యారెక్టర్ ఏంటంటే.. సునీల్ గారు ఎక్కిన రిక్షాని లాక్కొచ్చి వెళ్లిపోవడమే. ఆ ఒక్కటి చేసే నేను మళ్లీ ఫేస్ బుక్‌లో పెట్టేశాను. సునీల్ గారితో యాక్ట్ చేశాను.. మాములుగా ఉండదు. సూపర్.. బంపర్ అని ఫేస్ బుక్‌లో పెట్టేశా. అందరూ టీవీల ముందు కూర్చున్నారు. అయితే ఇలా వచ్చి చూసేలోపే ఏడి వీడు అని వెతుక్కునేలా ఉంటుంది ఆ క్యారెక్టర్. పాస్‌లో పెట్టి చూస్తేనే కానీ అది నేనని తెలియదు ఎవరికీ.. అలాంటి క్యారెక్టర్ చేసి.. హడావుడి చేశాను. ఫస్ట్ పెట్టినదానికి లైక్స్ బాగా ఎక్కువచ్చాయి.. అది టెలికాస్ట్ అయ్యాక కింద కామెంట్స్ అంతకంటే ఎక్కువ వచ్చాయి. ‘ఏం చేశావురా నువ్వు? ఎందుకు పెట్టావ్ రా ఫోటో? సునీల్ గారితో చేశానంటే నువ్వేదో ఆయన మీద కౌంటర్ వేసి.. ఆయన నీ మీద కౌంటర్ వేసి.. ఇంత హడావుడి ఉంటుందనుకుంటే.. నువ్వు రిక్షా లాక్కొచ్చావ్.. అది కూడా ఆపి చేస్తే కానీ కనిపించట్లేదు..’ ఇలా కామెంట్స్ వచ్చాయి. దాంతో ‘హో.. కనబడితే కాదు ఏదొకటి చెయ్యాలి మనం..’ అనే ఇంట్రెస్ట్ అప్పుడొచ్చింది. తర్వాత తర్వాత అభి అన్న స్కిట్‌లో చేస్తూ ఉండగా.. నేనే స్కిట్స్ రాయాల్సి రావడం, అవి డైరెక్షన్ డిపార్ట్‌మెంట్ వాళ్లకి ఎక్కువ నచ్చేసి వాళ్లు నా మీద ఫోకస్ చెయ్యడం, నన్ను టీమ్ లీడర్‌ని చెయ్యడం.. అంతా జరిగింది. తర్వాత నా అచీవ్‌మెంట్ ఏంటంటే.. ఎప్పుడైతే నేను సునీల్ గారిని రిక్షాలో లాక్కొచ్చానో.. అదే సునీల్ గారు నేను టీమ్ లీడర్‌గా చేసిన స్కిట్‌లో ఆయన కూడా నాతో పాటు చేసి.. నేను ఆయన మీద పంచ్‌లు వేసి అంత.. అలా వచ్చాననిమాట. అది నిజంగా ప్రౌడ్ ఫీలింగ్’ అంటూ చెప్పుకొచ్చారు హైపర్ ఆది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3fVPKo2

No comments:

Post a Comment

'I Focused On Studying Charles Sobhraj'

'The opportunity to live as the Serpent excited me.' from rediff Top Interviews https://ift.tt/AtWXqwk