Tuesday 23 June 2020

HBDVijayashanti: సినిమా అంటే హీరోయిన్ కూడా.. ఇదీ విజయశాంతి ‘కర్తవ్యం’

లేడీ ఓరియంటెడ్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్.. దక్షణ భారతదేశంలోనే గ్లామర్‌కే గ్రామర్ నేర్పిన ది లేడీ సూపర్ స్టార్, లేడీ అమితాబ్ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఆమెకు శుభాకాంక్షలు వెల్లువెత్తున్నాయి. సినిమా అంటే హీరో.. హీరో అంటే సినిమా.. హీరో చుట్టూనే సినిమా కథ.. ఉండే పరిస్థితుల్లో హీరోయిన్ కోసం కథ లేదా? లేడీ ఓరియంటెడ్ కథ రాదా? అనే ప్రశ్నలకు తన చిత్రాలతో సమాధానం ఇచ్చింది లేడీ సూపర్ స్టార్ విజయశాంతి. లేడీ ఓరియంటెడ్ చిత్రాలతో టాలీవుడ్‌కి కొత్త రూపు తీసుకువచ్చిన ఘనత ఈ లేడీ సూపర్ స్టార్‌కే దక్కుతుంది. అత్యధిక హీరోయిన్ ఓరియంటెడ్ చిత్రాలతో ట్రెండ్ క్రియేట్ చేసిన విజయశాంతి.. 30 సంవత్సరాల సినీ ప్రస్థానంలో సుమారు 180 సినిమాలకు పైగా నటించింది స్టార్ హీరోయిన్ హోదా దక్కించుకుంది. చిరంజీవి, బాలయ్య, నాగార్జున, వెంకటేష్ లాంటి స్టార్ హీరోలు ఈమె డేట్స్ కోసం వెయిట్ చేసేవారంటే ఈమె కాంబోకి ఉన్న క్రేజ్ అర్థం చేసుకోవచ్చు. టాలీవుడ్‌ మెగాస్టార్ చిరంజీవి-విజయశాంతి హిట్ కాంబినేషన్‌లో పలు విజయవంతమైన చిత్రాలు నేటికీ తెలుగు ప్రేక్షకుల్ని అలరిస్తూనే ఉన్నాయి. మెగాస్టార్‌తో కలిసి 19 చిత్రాల్లో కథానాయికగా నటించిన విజయశాంతి. ఇక నందమూరి బాలకృష్ణ‌తో 17 చిత్రాల్లో నటించింది. వెంకటేష్, నాగార్జునలతో సైతం ఆడిపాడిన విజయశాంతి నటనతోనే కాదు.. పారితోషికం విషయంలోనూ హీరోలతో పోటీ పడుతూ అత్యధిక రెమ్యునరేషన్ అందుకున్న నటిగా పేరుగడించింది. 1966 జూన్ 24న వరంగల్‌లో జన్మించిన విజయశాంతి.. తన పిన్ని విజయలలిత వారసత్వంతో ఏడేళ్ల వయసులోనే బాల నటిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. సూపర్ స్టార్ కృష్ణ నటించిన ‘కిలాడీ కృష్ణుడు’తో హీరోయిన్‌గా తెరంగేట్రం చేసిన విజయశాంతి ఆ తరువాత వెనుతిరిగి చూసుకోకుండా వరుస చిత్రాల్లో నటించింది. 1991లో ‘కర్తవ్యం’ సినిమాలో నటనకు గానూ జాతీయ సినిమా ఉత్తమ నటి పురస్కారాన్ని అందుకుంది విజయశాంతి. తెలుగు ప్రేక్షకులతో లేడీ సూపర్ స్టార్‌గా తిరుగులేని గుర్తింపు సంపాదించుకున్న విజయశాంతి.. పొలిటికల్ ఎంట్రీతో సినిమాలకు దూరమయ్యారు. 2006లో వచ్చిన ‘నాయుడమ్మ’ సినిమాలో ఆమె చివరిగా కనిపించారు. అయితే 13 ఏళ్ల విరామం తరువాత మహేష్ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంలో తల్లి పాత్రలో కనిపించారు విజయశాంతి. తాజాగా మెగాస్టార్ డ్రీమ్ ప్రాజెక్ట్ లూసిఫర్‌లో విజయశాంతి నటిస్తున్నట్టు తెలుస్తోంది. 90వ దశకంలో హిట్‌ఫెయిర్‌గా నిలిచిన చిరంజీవి, విజయశాంతి ఈ చిత్రంతో మరోసారి సిల్వర్‌స్క్రీన్‌పై మెరువనున్నట్లు టాక్‌ వినిపిస్తోంది. మొత్తానికి లాంగ్ గ్యాప్ తరువాత తెలుగు సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన విజయశాంతి మరిన్ని విజయవంతమైన చిత్రాల్లో నటించాలని కోరుకుంటూ.. హ్యాపీ బర్త్ డే లేడీ సూపర్ స్టార్.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2Vgjd46

No comments:

Post a Comment

'Trump Respects The Indian People'

'The relationship between India and the US, when Donald Trump was president, had been so much stronger.' from rediff Top Interview...