Saturday 20 June 2020

Fighter: ఎలాంటి మార్పు లేదు.. చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నామంటున్న ఛార్మి

కరోనా నివారణలో భాగంగా ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌తో గత రెండున్నర నెలలుగా వాయిదాపడ్డ షూటింగ్స్ ఒక్కొక్కటిగా మొదలవుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి అనుమతులు రావడంతో ఆగిపోయిన తమ తమ సినిమాలను సెట్స్ మీదకు తెచ్చేందుకు సన్నద్ధమవుతున్నారు దర్శకనిర్మాతలు. ఈ క్రమంలోనే హీరోగా దర్శకత్వంలో రూపొందుతున్న 'ఫైటర్' (వర్కింగ్ టైటిల్) సినిమా షూటింగ్ స్టార్ట్ చేయాలని భావిస్తున్న పూరి.. తన స్క్రిప్టులో కొన్ని మార్పులు చేస్తున్నారని వార్తలు వచ్చాయి. తాజాగా ఈ వార్తలపై స్పందిస్తూ పూర్తి క్లారిటీ ఇచ్చింది. ముంబై బ్యాక్‌డ్రాప్‌లో బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్‌ని లాక్‌డౌన్ కంటే ముందే కంప్లీట్ చేశారు పూరి జగన్నాథ్. ముందుగా రాసుకున్న కథ ఆధారంగా ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ విదేశీ ఫైటర్స్‌‌తో ఫైటింగ్‌ చేసే కొన్ని సీన్స్ ఉన్నాయి. అయితే ప్రస్తుతం కరోనా ఉదృతి ఎక్కువగా ఉండటంతో ఫైట్ సీన్స్‌తో పాటు విదేశాల్లో చిత్రీక‌రించాల్సిన షెడ్యూల్లో కూడా మార్పులు, చేర్పులు చేస్తున్నార‌ని సోష‌ల్ మీడియాలో వార్త‌లు షికారు చేశాయి. ఈ మేరకు స్క్రిప్ట్‌లో కొన్ని మార్పులు చేస్తున్నారని విన్నాం. ‌ Also Read: ఈ వార్త‌ల‌పై నిర్మాత‌ల్లో ఒక‌రైన ఛార్మి స్పందిస్తూ తాజాగా ట్విట్ట‌ర్ ద్వారా క్లారిటీ ఇచ్చింది. ‘‘ఫైటర్ స్క్రిప్ట్‌లో ఎలాంటి మార్పులు చేయడం లేదు. ఇది బ్లాక్‌బస్టర్ స్క్రిప్ట్. ఈ మూవీ పట్ల మేమంతా చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాం. త్వరలోనే టైటిల్ అనౌన్స్ చేస్తాం’’ అని పేర్కొంటూ కరోనా ప్రభావం పూర్తిగా తగ్గిన తర్వాతే తిరిగి షూటింగ్ ప్రారంభిస్తామని ప్రకటించింది. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను పూరి, ఛార్మి, కరణ్‌ జోహార్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. చిత్రంలో విజయ్ దేవరకొండ సరసన బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్‌గా నటిస్తోంది. ఇస్మార్ట్ శంకర్ లాంటి భారీ హిట్ తర్వాత పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వస్తున్న సినిమా కావడంతో ఈ మూవీపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3dcn9sI

No comments:

Post a Comment

'We Attribute Failure To The Director'

'Our analysis of success, like failure, is so reductive and so one dimensional that we don't look at the bigger picture.' from...