Tuesday, 2 June 2020

ఎత్తుకు పై ఎత్తు వేస్తా.. గతంలో తెలియదు కానీ ఇప్పుడు మాత్రం: కాజల్ అగర్వాల్

గతంలో తెలియని కొత్త విషయాలను, కొత్త టాలెంట్‌ని మెరుగు పర్చుకున్నానని అంటోంది బ్యూటిఫుల్ హీరోయిన్ . కారణంగా గత రెండు నెలలకు పైగా ఇంట్లోనే ఉంటూ ఫిట్‌నెస్‌పై శ్రద్ద పెట్టిన ఈ ముద్దుగుమ్మ ఆన్ లైన్‌లో మరో విద్య కూడా నేర్చుకుందట. చదరంగం (చెస్) ఆటపై దృష్టి పెట్టి దానిపై పట్టు సాధించానని చెబుతోంది కాజల్. గతంలో చెస్ ఆట గురించి పూర్తిగా తెలియదని, ఈ ఖాళీ సమయంలో దానిపై పట్టు సాధించాలని డిసైడ్ అయి పూర్తిగా నేర్చుకున్నానని చెప్పింది. ఇంటిపట్టునే ఉంటూ ఆన్‌లైన్‌లో నేర్చుకోవడంతో చెస్ ఆటపై పూర్తి పట్టు వచ్చింది, ఎత్తుకు పై ఎత్తు ఎలా వేయాలో తెలిసిందని ఆమె తెలిపింది. ఈ ఆట వల్ల మెదడు చురుకుగా ఉండటమే గాక కొత్త ఉత్తేజం రేకెత్తుతుంది కాబట్టే ప్రత్యేక దృష్టి పెట్టానని చెప్పింది. దీంతో పాటు ఆధ్యాత్మికంగా కూడా డెవలప్ అయ్యానని కాజల్ చెప్పుకొచ్చింది. మనసును ఆహ్లాదంగా ఉంచుకోవడం కోసం ఆధ్యాత్మిక విషయాలపై ఫోకస్ పెట్టానని, ఇంట్లో పెద్దవాళ్లని అడిగి మరీ మన పురాణ కథలను తెలుసుకున్నానని తెలిపింది. ముఖ్యంగా అమ్మమ్మ చెప్పిన భాగవతం శ్రద్ధగా విన్నానని, అలాగే భగవద్గీతలోని కొన్ని శ్లోకాలను నేర్చుకుంటున్నానని కాజల్ చెప్పింది. ఇక ఈ లాక్‌డౌన్ సమయంలో దూరదర్శన్‌లో తిరిగి ప్రసారమవుతున్న రామాయణ్, మహాభారత్ సీరియల్స్ ఎంతో ఆనందాన్నిచ్చాయని ఆమె చెప్పింది. ఇక కాజల్ సినిమాల విషయానికొస్తే.. శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న 'భారతీయుడు 2' సినిమాలో కమల్ హాసన్ సరసన నటిస్తోంది. అలాగే కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'ఆచార్య' మూవీలో చిరంజీవి సరసన నటిస్తోంది. షూటింగ్స్ రీ ఓపెన్ కాగానే ఈ రెండు సినిమాల సెట్స్ పైకి వెళ్లి అగ్ర హీరోలతో రొమాన్స్ చేయనుంది కాజల్ అగర్వాల్.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/303BpAY

No comments:

Post a Comment

'No Plan To Phase Out Old I-T Regime'

'Going forward, the encouragement would be to move to the new tax regime.' from rediff Top Interviews https://ift.tt/ZqrBWh3