Wednesday 24 June 2020

‘చిరు.. చరణ్‌ని, చంద్రబాబు.. లోకేష్‌ని కాకపోతే పక్కింటోడ్ని ప్రోత్సహిస్తారా’?

వ్యాపారం కావచ్చు.. రాజకీయం కావచ్చు.. సినిమా కావచ్చు.. రంగం ఏదైనా తమ కుటుంబంలోని సభ్యుడ్ని ప్రోత్సహించుకోవడం కొత్త విషయం కాదని అంటున్నారు వివాదాల దర్శకుడు . యువ టాలెంటెడ్ హీరో రాజ్ పుత్ నెపోజిజం కారణంగానే ఆత్మహత్య చేసుకున్నారనే వార్తలపై వర్మ స్పందిస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఓ మీడియా ఛానల్‌తో ఆయన మాట్లాడుతూ.. ‘బంధుప్రీతి అనేది ప్రతి ఒక్కరికీ ఉంటుంది.. వారి వారి పిల్లల్ని, వారి బంధువుల్ని ప్రోత్సహించుకోవడం కామన్. అన్ని రంగాల మాదిరే సినిమా ఇండస్ట్రీలోనూ అది ఉంది. నెపోటిజం అనేది కొత్తేం కాదు. అయితే దీని కారణంగా ప్రతిభను తొక్కేస్తున్నారనే ఆరోపణల్ని నేను వ్యతిరేకిస్తున్నాను. అదే నిజమైతే టాలీవుడ్‌లో విజయ్ దేవరకొండకు ఏం బ్యాగ్రౌండ్ ఉంది.. వాళ్ల ఫాదర్‌కి ఇండస్ట్రీతో పరిచయాలు లేవు.. వ్యాపార వేత్త కూడా కాదు.. మరి విజయ్ ఎలా సక్సెస్ అయ్యాడు. టాలెంట్ ఉంది కాబట్టే సూపర్ స్టార్ అయ్యాడు. అయితే ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ ఉన్నంత మాత్రాన సినిమాలు ఆడవు. అది డిసైడ్ చేసేది ప్రేక్షకులు. హీరోని చేయాలన్నా.. జీరోగా మార్చాలన్నా ప్రేక్షకుల చేతుల్లోనే ఉంటుంది. అయితే బయట నుంచి వచ్చే హీరోల కంటే కూడా స్టార్ కిడ్స్‌కి కొంత ప్రాధాన్యత ఉంటుందనేది సత్యం. క్రేజ్ దక్కించుకోవడం కోసం.. వాళ్ల నాన్నలు, తాతలు పడినంత కష్టం వాళ్లు పడకపోయినా టాలెంట్ అయితే నిరూపించుకోవాల్సిందే. అయినా హీరోలు వాళ్ల వారసుల్ని పరిచయం చేయకపోతే పక్కింటి వాళ్లను పరిచయం చేస్తారా?? నెపోటిజం అనేది పనిలేని వాళ్లు పబ్లిసిటీ కోసం చేసే వాదన తప్పితే మరేం లేదు. రాజకీయాల్లో వారసులు వస్తారు.. సినిమాల్లోనూ అంతే.. చంద్రబాబు లోకేష్‌ని ప్రోత్సహిస్తారు.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి.. జగన్‌ని ప్రోత్సహించారు. ఇందులో తప్పేంలేదు. అలాగే సినిమాల్లో చిరంజీవి రామ్ చరణ్‌ని ఇంట్రడ్యూస్ చేశారు.. వాళ్ల కొడుకును కాకుండా పక్కింటోడి కొడుకిని ఇంట్రడ్యూస్ చేస్తారా? ఇక నిర్మాత ఛాయిస్‌ని బట్టి ఎంపిక ఉంటుంది. వాళ్లే ఎందుకు అంటే ప్రతిదానికి ఒక లెక్క ఉంటుంది. ఎవరిని పెట్టి సినిమా తీయాలన్నది నిర్మాత ఇష్టం. స్టార్ కిడ్స్‌కి అవకాశం ఇస్తారా? లేక కొత్త వాళ్లను తీసుకుంటారా? అన్నది నిర్మాత ఛాయిస్. ఇక సుశాంత్ విషయంలో ఆయన ఫెయిల్యూర్ అని అనలేం. ఫ్లాప్ హీరో అని అనలేం. తనని తాను ప్రూవ్ చేసుకున్నారు. బాలీవుడ్‌లో టాప్ 15 స్టార్ హీరోల్లో ఒకరిగా ఉన్నారు. అతని ఆత్మహత్యకు ఫెయిల్యూర్ అనేది కారణం అని నిర్ధారించలేం’ అంటూ చెప్పుకొచ్చారు వర్మ.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/37WoNxr

No comments:

Post a Comment

'Omar Abdullah Is Seen As A Tourist'

'The Abdullah family is the problem and facilitator of the instability that we are seeing in Kashmir.' from rediff Top Interviews ...