Tuesday, 2 June 2020

నమ్రతను ఫాలో అవుతున్న గౌతమ్, సితార.. విదేశాల్లో ఆ ముగ్గురూ! వీడియో వైరల్

మహేష్ బాబు క్యూట్ ఫ్యామిలీకి సంబంధించిన అన్ని విషయాలు నెటిజన్లకు ఆసక్తి కలిగిస్తుంటాయి. ముఖ్యంగా మహేష్ గారాలపట్టి సితార సంగతులంటే మాహా ఇష్టపడుతుంటారు ఆయన ఫ్యాన్స్. గౌతమ్, నమ్రతలకు సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు ఫాలో అవుతుంటారు. అయితే నెటిజన్ల ఆసక్తికి రెక్కలు కట్టేలా మహేష్ సతీమణి ఎప్పుడూ ఏదో ఒక పోస్ట్ పెడుతూ ఆకట్టుకుంటూనే ఉంటుంది. సోషల్ మీడియాలో యమ యాక్టివ్‌గా ఉండే నమ్రత.. తాజాగా విదేశాల్లో కొడుకు, కూతురుతో సరదాగా సైక్లింగ్ చేస్తున్న వీడియో షేర్ చేసింది. ఇందులో సైక్లింగ్‌ చేస్తూ తల్లి నమ్రతను ఫాలో అవుతూ కనిపిస్తున్నారు గౌతమ్, సితార. జర్మనీలో బ్రెన్నర్స్‌లో కొడుకు గౌతమ్ కృష్ణ, కూతురు సితారలతో సరదాగా నమ్రత సైక్లింగ్ చేసిన వీడియో ఇది. నిజానికి ఈ వీడియో ఇప్పటిది కాకపోయినా.. తన ఇద్దరు పిల్లలతో సైక్లింగ్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్న నమ్రతను చూసి మురిసిపోతున్నారు మహేష్ బాబు అభిమానులు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. Also Read: ఇన్నాళ్లు కుటుంబ బాధ్యతలతో బిజీ బిజీగా గడిపిన నమ్రత.. గత కొన్ని రోజులుగా మహేష్ బాబు వ్యాపార కార్యకలాపాలై దృష్టి సారించింది. మహేష్ సొంత బ్యానర్ జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పూర్తి బాధ్యతలను ఆమెనే చూసుకుంటున్నట్లు సమాచారం. ఇదే బ్యానర్ పై మహేష్ తదుపరి సినిమా 'సర్కారు వారి పాట' రూపొందుతోంది. పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ మూవీ లాక్‌డౌన్ ఫినిష్ కాగానే సెట్స్ మీదకు రానుంది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/36SYQhW

No comments:

Post a Comment

'Only If There Is Chamatkar Can BJP Win Delhi'

'Till the BJP does not understand Kejriwal they cannot win Delhi.' from rediff Top Interviews https://ift.tt/RTxwKSH