నటుడు సోనూ సూద్ వలస కార్మికులను తిరిగి స్వగ్రామాలకు చేర్చడానికి ఎంత కృషి చేస్తున్నాడో సంగతి తెల్సిందే. ఇటీవల ఒడిశాకు చెందిన కొందరు అమ్మాయిలు లాక్ డౌన్ వల్ల కేరళలో చిక్కుకుంటే ప్రత్యేక విమాన ఏర్పాటు చేసి మరీ పంపించారు. లాక్ డౌన్‌లో చిక్కుకున్నామని ఎవరు చెప్పినా సరే.. వెంటనే స్పందించి ఏర్పాట్లు చేస్తు్న్నారు. సోను సూద్ చేసిన సహాయానికి కృతజ్ఞతగా ఓ వలస కార్మికురాలు తన బిడ్డకు ఆయన పేరు పెట్టడం గమనార్హం. గర్భవతిగా ఆమెను సురక్షితంగా ఇంటికి చేర్చేందుకు చేశారనే కారణంతో ఆమె తన అభిమానాన్ని ఇలా చాటుకుంది. తాజాగా మనీష్ అనే ఓ యువకుడు సోను సూద్ ఫొటోకు పూజలు చేయడం మొదలుపెట్టాడు. తనను తిరిగి తల్లి వద్దకు చేర్చేందుకు సోనుసూద్ సహాయంగా చేశారని, అందుకే ఆయన తనకు దేవుడితో సమానమని తెలిపాడు. Also Read: సోనుసూద్ ఫొటోకు పూజలు చేస్తున్న వీడియోను మనీష్ తన ట్విట్టర్ అకౌంట్‌లో పోస్తు చేశాడు. దీంతో ఆ వీడియో క్షణాల్లో వైరల్‌గా మారింది. ‘‘పిల్లలను అమ్మవద్దకు చేర్చేవాళ్లు దేవుడితో సమానం. మనుషులంతా సోనుసూద్‌లా దేవుడు కాలేరు. నేను సోనుసూద్‌ను దేవుడిగా భావిస్తాను. ఆయన నా కలలను కాపాడారు. నన్ను అమ్మ వద్దకు చేర్చారు’’ అని ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు. Also Read: ఈ వీడియో చూసిన సోను సూద్ వెంటనే రిప్లై ఇచ్చారు. ‘‘తమ్ముడు అలా చేయొద్దు. రోజు అమ్మను నా కోసం ప్రార్థించమని చెప్పండి. అంతా బాగుంటుంది’’ అని తెలిపారు. ఈ వీడియోపై నెటిజనులు భిన్నంగా స్పందిస్తున్నారు. ఆ వీడియో పోస్టుచేసిన మనీష్.. సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న జూనియర్ ఆర్టిస్ట్ కావడమే ఇందుకు కారణం. ఆ వీడియో మరీ డ్రామటిక్‌గా ఉందని, కొంచెం ఎక్కువ చేస్తున్నావ్ అనిపిస్తోందని నెటిజనులు కామెంట్లు చేస్తున్నారు. బతికున్న మనిషికి అగరబత్తులతో పూజ చేయకూడదని మరికొందరు క్లాస్ పీకుతున్నారు. మరి దీనిపై మీరేమంటారు. వీడియో:
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/376Gv17
No comments:
Post a Comment