Monday, 1 June 2020

ఆ వార్తలన్నీ రూమర్స్.. అందుకే వేదిలేశా: అసలు మ్యాటర్ చెప్పిన రష్మిక మందన

టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ వరుస హిట్స్ ఖాతాలో వేసుకుంటూ సూపర్ ఫామ్ కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. 'ఛలో' అంటూ టాలీవుడ్ గడపతొక్కిన ఈ కన్నడ భామ ఈ ఏడాది ''సరిలేరు నీకెవ్వరు, భీష్మ'' రూపంలో బ్యాక్ టు బ్యాక్ విజయాలందుకుంది. దీంతో ఆమెకు వరుస అవకాశాలు తలుపుతడుతున్నాయి. అయితే ఈ సిచుయేషన్ క్యాచ్ చేసుకుంటూ ఆమె భారీ రెమ్మ్యూనరేషన్ డిమాండ్ చేస్తోందని, అందుకే ఇటీవల వచ్చిన బాలీవుడ్ ఆఫర్ రిజెక్ట్ చేసిందని వార్తలు వస్తున్న నేపథ్యంలో వాటిపై రియాక్ట్ అయింది రష్మిక. తెలుగులో నాని- శ్రద్ద శ్రీనాథ్ హీరో హీరోయిన్లుగా రూపొందిన 'జెర్సీ' సినిమాను హిందీలో రీమేక్ చేస్తున్నారు. షాహిద్ కపూర్ హీరోగా ఈ మూవీ తెరకెక్కనుంది. అయితే ఇందులో హీరోయిన్‌గా రష్మిక అనుకున్నారని, కానీ ఆమె ఈ ఆఫర్ కాదనుకోవడమే గాక భారీ రెమ్మ్యూనరేషన్ డిమాండ్ చేసిందని టాక్ బయటకొచ్చింది. ఈ క్రమంలో తాజాగా ఈ విషయమై రియాక్ట్ అయిన రష్మిక.. తాను భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేయలేదని అలా వస్తున్న వార్తలన్నీ రూమర్స్ అని చెప్పింది. డేట్స్ అందుబాటులో లేకపోవడం కారణంగానే ఆ మూవీ వదులుకోవాల్సి వచ్చిందని క్లారిటీ ఇచ్చింది. Also Read: ఇకపోతే ప్రస్తుతం 'పుష్ప' సినిమాలో అల్లు అర్జున్ సరసన విలక్షణ పాత్రలో నటిస్తోంది రష్మిక మందన. సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీలో పల్లెటూరి అమ్మాయిగా ఆమె అలరించనున్నట్లు సమాచారం. అదేవిధంగా చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రాబోతున్న 'ఆచార్య' మూవీలోనూ రష్మిక ఛాన్స్ పట్టేసిందని తెలుస్తోంది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2XViO7u

No comments:

Post a Comment

'I Felt Enough Is Enough And Quit The BJP'

'All senior Muslim leaders of the BJP are left behind.' from rediff Top Interviews https://ift.tt/yCEdUhr