మెగా బ్రదర్, జనసేన నాయకుడు నాగబాబు మరోసారి సోషల్ మీడియా వేదికగా కొన్ని ఘాటైన ట్వీట్లు చేశారు. భారతీయుల రక్తం చల్లబడిపోయిందటూ ఆయన పేర్కొన్నారు. మన రానున్న తరాలనైనా పౌరుషం, సాహసం ఉండేలా పెంచాలన్నారు. భారతీయుల రక్తం శాంతి,అహింస మంత్రాలతో,చల్లబడిపోయిందని ట్వీట్‌లో పేర్కొన్నారు నాగబాబు.తిరిగి రక్తం వేడెక్కలంటే ఛత్రపతి శివాజీ,రాణా ప్రతాప్ సింగ్,అశోక చక్రవర్తి,సామ్రాట్ పృథ్విరాజ్ చౌహన్,శ్రీకృష్ణ దేవరాయలు,రాజ రాజ చోళుడు,సముద్రగుప్తుడు,మొదలైన మహావీరుల కథలని పిల్లలతో చదివిస్తే నెక్స్ట్ జనరేషన్ ఆయనా .... సాహసం,పౌరుషం,మరిగే రక్తం తో పెరుగుతారన్నారు. ఎలాగూ మన రక్తం చల్లబడి పోయిందన్నారు. వాళ్ళనన్నా దేశానికి ఉపయోగ పడే వీరులు గా తయారు చేద్దామన్నారు నాగబాబు . భారత దేశానికి .. దేశాన్ని ప్రేమించేవీరులు కావాలన్నారు. డబ్బుకు ఓట్లు వేసే సాధారణ పౌరులు కాదన్నారు. దేశాన్ని పట్టి పీడిస్తున్న దేశద్రోహులు,గుండాలు,మాఫియా,ఫ్యాక్షన్, గుండా రాజకీయనాయకులు, కుహనా ఉదారవాదులు, ఉగ్రవాదుల నుంచి ఈ దేశాన్ని కాపాడే వీరులు కావాలని నా కోరిక అంటూ ట్వీట్‌లో పేర్కొన్నారు. ప్రతి నేరాన్ని పోలీస్ ,మిలిటరీ మాత్రమే డీల్ చెయ్యాలంటే కుదరని పని అన్నారు నాగబాబు. నాగబాబు ఇలా వరుసగా మూడు ట్వీట్లు చేశారు. నాగబాబు చేసిన సోషల్ మీడియా ట్వీట్లకు పలువురు నెటిజన్స్ మద్దతుగా నిలిచారు. మీరు చెప్పిన వీరుల కథలు రేపటి తరానికి అందేవిధంగా మన పాఠ్య పుస్తకాలలో ప్రచురించాలని ఓ నెటిజన్ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ద్వారా డిమాండ్ చేస్తున్నామని పేర్కొన్నారు. అవును మీరు చెప్పిందే కరెక్ట్ భారతదేశంలో ఉన్న ప్రతీ పౌరుడు ఓ సైన్యంలా తయారవ్వాలన్నారు.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3eJgqaC
No comments:
Post a Comment