Monday, 1 June 2020

తాత అంత్యక్రియలు పూర్తి.. చిరునవ్వుతో బయటకు వస్తున్న ఉపాసన

టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన పుట్టింట్లో విషాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. దోమకొండ కోట వంశీయుడు, ఉపాసన తాతయ్య కామినేని ఉమాపతి రావు హైదరాబాద్‌లోని అపోలో హస్పటల్‌లో చికిత్స పొందుతూ కన్నుమూశారు. వయస్సు పైబడడంతో ఆయన తుదిశ్వాస విడిచినట్టు సమాచారం. ఉమాపతి రావు అంత్యక్రియలు నిన్న నిజామాబాద్ జిల్లాలోని దోమకొండలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాసన ఇవాళ ఓ ట్వీట్ చేశారు. ‘ఇక ముందుకు సాగాల్సిన సమయం. తాత స్వర్గం ద్వారంలోకి ప్రవేశించారు. ఇక నేను మరిన్ని ముఖ్యమైన అంశాలు నేర్చుకుంటూ, సంతోషకరమైన జ్ఞాపకాలతో, అనుభవాలతో ముందుకు వెళ్తాను’ అంటూ చేశారు. ఈ సందర్భంగా దోమకుండ కోట నుంచి బటయకు వస్తున్న ఫోటోను కూడా ఆమె షేర్ చేశారు. ఉపాసన తాత ఉమాపతి రావు ఐఏఎస్ ఆఫీసర్‌గా పని చేశారు. ఉమాపతి రావు మృతితో కామినేని కుటుంబీకులు శోక సంద్రంలో మునిగిపోయారు. భావోద్వేగానికి గురైన ఉపాస‌న..‌ సోషల్ మీడియా ద్వారా తన తాతయ్యకు నివాళులు అర్పించింది.ఉమాపతి రావు తెలంగాణలోని కామారెడ్డి జిల్లా దోమకొండ గ్రామంలో జన్మించారు. దీంతో ఆయన అంత్యక్రియలు దోమకొండలోనే నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చిరంజీవి, రామ్ చరణ్ హాజరయ్యారు. ఉపాసన తాత అంత్యక్రియల కార్యక్రమంలోనే తేనెటీగలు దాడి చేశాయి. వెంటనే అప్రమత్తమైన సెక్యూరిటీ సిబ్బంది చిరంజీవి రామ్ చరణ్‌తో పాటు ఉపాసనను కూడా క్షేమంగా అక్కడ్నుంచి బయట పడ్డారు. అక్కడున్న మరికొందరిపై సడన్ గా తేనేటీగలు మీదకు రావడంతో వారు ఇబ్బంది పడ్డారు. వెంటనే స్థానికులు వారందరిని సురక్షితంగా వేరే ప్రదేశానికి తరలించారని సమాచారం.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2TY3Dt9

No comments:

Post a Comment

Will Hathiram Be Killed In Paatal Lok?

'I insisted only Jaideep could play Inspector Haathiram Chaudhary.' from rediff Top Interviews https://ift.tt/RHLTIwD