దేశంలో కరోనా కోరలు చాస్తోంది. పలువురు సెలబ్రిటీలు సైతం కరోనా బారిన పడుతుండటం చూస్తూనే ఉన్నాం. అయితే మహమ్మారి వైరస్ విజృంభణ రోజు రోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో సోషల్ మీడియాలో పలు రూమర్స్ పుట్టుకొస్తున్నాయి. ఈ క్రమంలోనే ప్రేమ పక్షులు నయనతార- విగ్నేశ్ శివన్‌లకు కరోనా పాజిటివ్ వచ్చిందనే వార్తలు కోలీవుడ్ వర్గాలకు షేక్ చేశాయి. దీంతో తమ అభిమాన తారకు కరోనా సోకిందని తెలిసి షాకయ్యారు తెలుగు, తమిళ ప్రేక్షకులు. ఆ వార్త తెలిసి ఆందోళన చెందిన ఫ్యాన్స్.. త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ నెట్టింట్లో వరుస పోస్టులు పెడుతున్నారు. దీంతో రంగంలోకి దిగిన నయన్ టీం ఈ వార్తలపై క్లారిటీ ఇచ్చింది. నయన్, విగ్నేష్ లకు కరోనా సోకిందని వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని వాళ్ళు స్పష్టం చేశారు. ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. Also Read: మరోవైపు తన ఆరోగ్యం గురించి వస్తోన్న వార్తలపై విగ్నేశ్ స్పందించారు. తాము ఆరోగ్యంగా ఉన్నామని పేర్కొంటూ ఓ ప్రత్యేక వీడియోను తన సోషల్ మీడియా ఖాతా ద్వారా షేర్ చేశారు. నయన్, విగ్నేశ్ సరదాగా డ్యాన్స్ చేస్తూ ఈ వీడియోలో కనిపించారు. అలాంటి పుకార్లను నమ్మొద్దని కోరారు. దీంతో నయనతార అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2AO3Wk3
No comments:
Post a Comment