Monday, 22 June 2020

జబర్దస్త్ వచ్చేసింది.. అనసూయ మూడ్ మారే ఛాన్స్ లేదు.. హిమజ ఎంట్రీ

కోవిడ్ 19 ప్రభావంతో నవ్వుల జల్లుకు బిగ్ బ్రేక్ పడగా.. మళ్లీ కామెడీతో కితకితలు పెట్టేందుకు ఎక్స్ ట్రా ఫన్‌తో రెడీ అయ్యింది ఖతర్నాక్ కామెడీ షో ‘జబర్దస్త్’. ‘‘ఆరు టీంలు.. ఒక్కో టీంకి ఐదుగురు కంటెస్టెంట్స్‌ల సపోర్ట్.. ఇద్దరు జడ్జీలు.. ఒక్కరే యాంకర్.. మూడ్ మారే చాన్సే లేదు.. నలుగుర్నీ నవ్వించే పంచ్‌లతో మేం రెడీ’ అంటూ జేమ్స్ బాండ్ హీరోయిన్ లుక్‌తో కొత్తగా సరికొత్తగా కవ్విస్తూ ‘జబర్దస్త్’ ప్రోమోతో ఎంట్రీ ఇచ్చింది యాంకర్ . జబర్దస్త్ యాంకర్‌గా అనసూయను తప్పించి ఆమె ప్లేస్ కొత్త యాంకర్‌ని రంగంలోకి దింపుతున్నారనే రూమర్స్‌కి చెక్ పెడుతూ.. ఒక్కరే యాంకర్ ఆ యాంకర్‌ని నేనే అంటూ అదిరిపోయే ఎంట్రీ ఇచ్చింది అనసూయ. కొత్తగా సరికొత్తగా జూన్ 25 గురువారం నాడు ప్రసారం కాబోయే జబర్దస్త్ కామెడీ షోలో హైపర్ ఆది, రాకెట్ రాఘవ, వెంకీ, తాగుబోతు రమేష్, చలాకీ చంటి టీంలు పెర్ఫామ్ చేస్తుండగా.. సుడిగాలి సుధీర్, దొరబాబు, రాజమౌళి, సుధాకర్ తదితరులు సపోర్టర్స్‌గా పంచ్‌లతో పొట్ట చెక్కలు చేస్తున్నారు. జబర్దస్త్ ఎవర్‌గ్రీన్ బ్యూటిఫుల్ జడ్జీ రోజా రీ ఎంట్రీలో సందడి చేస్తుండగా.. ఆమె పక్కన సింగర్ మనో మరో జడ్జిగా కనిపిస్తున్నారు. ఇక తాజా ఎపిసోడ్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది బిగ్ బాస్ ఫేమ్ హిమజ. హైపర్ ఆది టీంలో ‘ఆకు చాటు పిందె తడిచె.. కోకమాటు పిల్ల తడిచె’ అంటూ స్టెప్పులు వేస్తూ రచ్చ చేస్తోంది. ‘మన ప్రేమకు చిహ్నంగా నీ పెదవిపై నా పేరు రాసుకో.. కుదరకపోతే కనీసం నీ గుండెపైన అయినా నా పేరు’.. అంటూ హైపర్ ఆదితో సిగ్గులొలకబోస్తుంది హిమజ. ఇక మిగతా టీంలు మొత్తం కోవిడ్ 19ని టార్గెట్ చేసి పంచ్‌లు గుప్పిస్తున్నారు. తాగుబోతు రమేష్ రీ ఎంట్రీతో అదరగొడుతున్నాడు.. ‘మొన్న కేసీఆర్ ప్రెస్ మీట్‌లో ఒక రిపోర్టర్.. సార్!! వైన్ షాప్‌ల పరిస్థితి ఏంటి అని అడిగాడు చూడు.. అతను వేయి గొంతుకలుగా.. ఆయనే నా జీవితంలో అత్యంత ఇష్టమైన వ్యక్తి’ అంటూ సెటైర్లు వేయడం.. జబర్దస్త్ లేటెస్ట్ ప్రోమోలో హైలైట్ అయ్యింది. తాజాగా ప్రోమోపై ఓ లుక్కేయండి.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3dqgqvc

No comments:

Post a Comment

'People Said I Was A Bewaqoof'

'Everything in life is about timing.' from rediff Top Interviews https://ift.tt/jRDQwv7