![](https://telugu.samayam.com/photo/76484100/photo-76484100.jpg)
జూన్ 21వ తేదీన నిర్వహించుకోబోతున్నాం. ఈ సందర్భంగా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేసిన కేంద్ర మాజీ మంత్రి, రెబెల్ స్టార్ ఓ స్పెషల్ వీడియో రిలీజ్ చేశారు. ఈ వీడియోలో కృష్ణం రాజు, ఆయన సతీమణి ఇద్దరూ కలిసి యోగా చేస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం కొన్ని టిప్స్ ఇచ్చారు. ఒక్కో ఆసనం గురించి క్షుణ్ణంగా వివరిస్తూ సదరు యోగాసనాలు చేసి చూపించారు కృష్ణం రాజు దంపతులు. Also Read: దేశాన్ని కరోనా ఇబ్బంది పెడుతున్న ఈ సమయంలో యోగా అసలైన పరిష్కార మార్గమని ఈ సందర్భంగా కృష్ణం రాజు పేర్కొన్నారు. ఏ ఆసనాల ద్వారా రోగ నిరోధక శక్తి, ఊపిరితిత్తులకు శక్తి వస్తుందో స్వయంగా వివరించారు. ప్రజలు త్వరలోనే ఈ కరోనా మహమ్మారి ఇబ్బంది నుంచి ప్రజలంతా బయటపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని ఆయన తెలిపారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరోవైపు ఈ జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని సామాజిక దూరం పాటిస్తూ ఇంట్లోనే, కుటుంబంతో కలిసి జరుపుకోవాలని ప్రధాని మోదీ కోరారు. యోగాతో బహుళ ప్రయోజనాలున్నాయని, కరోనా కారణంగా తలెత్తిన అనేక సవాళ్లకు యోగా పరిష్కారం చూపుతుందని ఆయన తెలిపారు.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3emT2Qw
No comments:
Post a Comment