![](https://telugu.samayam.com/photo/76497322/photo-76497322.jpg)
దేశంలో కరోనా మహమ్మారి చొరబడి ఎన్నో మార్పులు తెచ్చింది. గతంలో ఎన్నడూ చూడని ఎన్నో వీడియోలు ఈ కరోనా కారణంగా చూడాల్సి వస్తోంది. కరోనా ఉదృతి నేపథ్యంలో గత మూడు నెలల కాలంగా ప్రజా జీవన వ్యవస్థ ఆగిపోయిన సంగతి తెలిసిందే. హోటల్స్, షూటింగ్స్, పబ్లిక్ పార్క్స్, బార్బర్ షాప్స్ ఎక్కడికక్కడ మూసివేయడంతో జనమంతా ఇంట్లోనే ఉండిపోయారు. ముఖ్యంగా సినీ సెలబ్రిటీలు గడపదాటి అడుగు బయటపెట్టలేదు. ఈ నేపథ్యంలో కాలక్షేపం కోసం వాళ్లంతా ఇంటిపని, వంటపని చేస్తూ ఆ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అలరించారు. ఇప్పటికే ఎంతోమంది సెలబ్రిటీల ఆసక్తికర వీడియోలు చూశారు నెటిజన్స్. ఈ క్రమంలోనే ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవికి ఆయన కూతురు హెయిర్ కటింగ్ చేస్తున్న వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. లాక్‌డౌన్ సడలింపులు ఇచ్చినప్పటికీ కరోనా కారణంగా బార్బర్ షాపుకి వెళ్లాలంటే జంకుతున్నారు జనం. సెలూన్ వంటి వాటికి దూరంగా ఉండి, వారి ఇంటిలోని వారితోనే కటింగ్ చేయించుకుంటున్నారు. తాజాగా కూడా అదే పని చేశారు. తన కూతురు సుస్మితతో హెయిర్ కటింగ్ చేయించుకున్నారు. Also Read: అయితే ఫాదర్స్ డే సందర్భంగా ఈ సీక్రెట్ వీడియోను బయటపెట్టింది సుస్మిత. ఈ మేరకు తన తండ్రి చిరంజీవికి ఫాదర్స్ డే శుభాకాంక్షలు తెలుపుతూ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది. ''సింపుల్ హెయిట్ కట్ నుంచి ప్రతి విషయంలోనూ మమ్మల్ని ఎంతగానో నమ్మినందుకు, మాపై మీ ప్రేమకు ధన్యవాదాలు'' అంటూ మెగా అభిమానులను ఆకట్టుకునే మెసేజ్ రాస్తూ ఈ వీడియో పోస్ట్ చేసింది సుస్మిత.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2Ym8l6y
No comments:
Post a Comment