Monday, 22 June 2020

బాలయ్య-బోయపాటి మూవీ టైటిల్ ఇదే.. త్వరలో అధికారిక ప్రకటన!

బాలయ్య-బోయపాటి అప్ కమింగ్ మూవీ బీబీ3కి టైటిల్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ఇటీవల బాలయ్య 60వ బర్త్ డే సందర్భంగా విడుదలైన బీబీ 3 టీజర్‌కి మాస్ ఆడియన్స్‌లో మంచి రెస్పాన్స్ వచ్చింది. బాలయ్య నుంచి వారి అభిమానులు ఏదైతో కోరుకుంటారో.. బోయపాటి తొలి టీజర్‌తోనే అందించడంతో నందమూరి ఫ్యాన్స్ ఫుల్ ఖుషీలో ఉన్నారు. వీరి కాంబోలో హ్యాట్రిక్ మూవీ కోసం ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. నరసింహ నాయుడు, సమరసింహారెడ్డి తరహా పవర్ ఫుల్ పాత్రలో కనిపించిన బాలయ్య.. ‘ఎదుటివాడితో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలో నేర్చుకో. శ్రీనుగారు మీ నాన్నగారు బాగున్నారా అనేదానికి.. శ్రీనుగారు మీ అమ్మ మొగుడు బాగున్నాడా అనేదానికి చాలా తేడా ఉందిరా లమ్మిడీ కొడకా’ అంటూ బాలయ్య చెప్పే పవర్ ఫుల్ డైలాగ్ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించింది. బాలయ్య డైలాగ్ డెలివరీ.. బోయపాటి టేకింగ్.. తమన్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ పర్ఫెక్ట్‌గా సెట్ కావడంతో బాలయ్య మళ్లీ బాక్సాఫీస్ వద్ద గర్జించడం ఖాయమే అంటున్నారు నందమూరి అభిమానులు. అయితే ఈ చిత్రానికి ‘’ అనే టైటిల్ తొలి నుంచి ప్రచారంలో ఉండగా.. అదే టైటిల్‌ను ఫిక్స్ చేసినట్టు సమాచారం. త్వరలో అధికారికంగా ప్రకటించే అవకాశం ఉండగా.. నందమూరి ఫ్యాన్స్ ఇప్పటికే ‘మోనార్క్’ టైటిల్‌ను వైరల్ చేస్తున్నారు. సింహ, లెజెండ్ చిత్రాలతో బ్లాక్ బస్టర్స్ అందుకున్న బాలయ్య-బోయపాటి ‘మోనార్క్’తో హ్యాట్రిక్‌పై కన్నేశారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3etJtiM

No comments:

Post a Comment

'Budget's Main Objective Was To Honour Taxpayers'

'Our attempt to honour the taxpayer has been since 2014 and more actively since 2019-2020 onwards.' from rediff Top Interviews htt...