టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ అంతా పెళ్లికి సిద్ధమవుతున్నారు. లాక్‌డౌన్ కారణంగా గత రెండు నెలలుగా షూటింగ్స్ లేక ఇంటికే పరిమితమైన సినీ సెలబ్రిటీలు పెళ్లి పీటలెక్కేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇటీవలే నిర్మాత దిల్ రాజు, హీరో నిఖిల్, కమెడియన్ మహేష్ పెళ్లి చేసుకోగా.. తాజాగా అదేబాటలో అడుగులు వేస్తున్నారు యంగ్ డైరెక్టర్ . గత కొంతకాలంగా ప్రవల్లిక అనే అమ్మాయితో ప్రేమలో ఉన్న ఆయన.. ఆమె మెడలో మూడు ముళ్ళేసేందుకు రెడీ అయ్యారు. ఈ క్రమంలోనే జూన్ 10వ తేదీన చేసుకుకోనున్నట్లు తెలిసింది. కుటుంబ సభ్యులు, పెద్దల సమక్షంలో సుజీత్ ఎంగేజ్‌మెంట్ జరగనుందట. ఇందుకోసం ఏర్పాట్లు జరుగుతున్నాయట. సుజీత్ చేసుకోబోయే అమ్మాయి ప్రవల్లిక వృత్తిరీత్యా డాక్టర్ అని సమాచారం. ఇంకా ఆమెకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. Also Read: 'రన్ రాజా రన్'తో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైన డైరెక్టర్ సుజీత్.. ఆ తర్వాత ప్రభాస్‌తో పాన్ ఇండియా మూవీ 'సాహో' రూపొందించి ఫేమస్ అయ్యారు. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి అప్‌కమింగ్ మూవీ 'లూసిఫర్' రీమేక్ స్క్రిప్ట్ డెవలప్ చేసే పనిలో ఉన్నారు. అతిత్వరలో ఈ మూవీని సెట్స్ మీదకు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2XtX7MI
No comments:
Post a Comment