Monday, 22 June 2020

తొక్కేయాలని చూస్తారు.. కాని!! నిఖిల్ షాకింగ్ కామెంట్స్

బాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో ఆత్మహత్యపై స్పందిస్తూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు హీరో . ఆయన నటించిన ‘అర్జున్ సురవరం’ బిగ్ స్క్రీన్‌పై సక్సెస్ కాగా.. ఆ చిత్రం టీవీలో ప్రసారమైన నేపథ్యంలో సోషల్ మీడియాలో ప్రచారం నిర్వహించారు నిఖిల్. ఈ సందర్భంగా లైవ్‌లోకి వచ్చిన నిఖిల్.. ‘అర్జున్ సురవరం’ చిత్ర విశేషాలను తెలియజేస్తూ తన పర్శనల్ విషయాలను షేర్ చేసుకున్నారు. ఈ సందర్భంగా నెటిజన్లు బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్‌ను గుర్తు చేస్తూ టాలీవుడ్‌లో నెపోటిజం ఉందా? మీకు అలాంటి పరిస్థితులు ఎదురయ్యాయా? అని ప్రశ్నించగా.. ఇక్కడ అలాంటి పరిస్థితి లేదని సమాధానం ఇచ్చారు నిఖిల్. అయితే ఇండస్ట్రీ అనే కాదు ప్రతి చోటా నెపోటిజం ఉంటుందని వాళ్లు ఎదగడం కోసం తొక్కేయడానికి ప్రయత్నిస్తారని అయితే మనం ధైర్యంతో టాలెంట్‌ని నమ్ముకుని నిలబడాలన్నారు నిఖిల్. విజయం సాధించాలనే ప్రయత్నాన్ని ఎన్ని కష్టాలు వచ్చినా ఎవరేమన్నా వదిలేయకూడదన్నారు నిఖిల్. అయితే సుశాంత్ మరణం తనను చాలా బాధించిందని ఎమోషనల్ అయ్యారు నిఖిల్. ఇక టాలీవుడ్‌ తనను బాగా స్వాగతించిందని.. తనను తొక్కేయడం లాంటి పరిస్థితులు ఎదురుకాలేదని అందరూ బాగా ప్రోత్సహించారని అన్నారు నిఖిల్. ఇక లాక్ డౌన్‌లో ప్రేమ వివాహం చేసుకున్న నిఖిల్ ప్రస్తుతం చందు మొండేటి దర్శకత్వంలో కార్తికేయ-2 చిత్రంలో నటిస్తున్నారు. కార్తికేయ చిత్రం నిఖిల్ కెరియర్‌లో బిగ్ సక్సెస్ కావడంతో ఈ చిత్రానికి సీక్వెల్‌గా కార్తికేయ-2 ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ చిత్రంలో సిక్స్ ప్యాక్‌లో కనిపించబోతున్నారు నిఖిల్.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2zWfmBN

No comments:

Post a Comment

'Budget Gives Middle Class Some Breathing Room'

'But this Budget alone will not fix what ails the Indian economy.' from rediff Top Interviews https://ift.tt/3EZi7XD