Saturday, 20 June 2020

కేసీఆర్ పట్టుదలతోనే ఇది సాధ్యపడింది: యాంకర్ ఉదయభాను

ప్రముఖ యాంకర్, నటి గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొన్నారు. రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను స్వీకరించిన ఉదయభాను.. ఆదివాం జూబ్లీహిల్స్‌లోని ఓ పార్కులో మూడు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఉదయభాను మాట్లాడుతూ.. ‘‘మొక్కలను నాటి పెంచడం మనందరి కర్తవ్యం. మన వంతు బాధ్యతగా మొక్కలు నాటాలి. ఒక నెల రోజులు భోజనం లేకుండా ఉండగలం. ఒక వారం రోజులు నీరు లేకుండా ఉండగలం. కానీ ఆక్సిజన్ లేకుండా ఒక నిమిషం కూడా ఉండలేం. ప్రకృతికి కోపం వస్తే ఏమవుతుందో మనందరం కళ్లారా చూస్తున్నాం. కరోనా లాంటి వివిధ రకాల వైరస్‌ల వల్ల ఇబ్బందులకు గురవుతున్నాం. ప్రకృతిని మనమే నాశనం చేస్తున్నాం. కాబట్టి ముందు తరాల వారికి మంచి వాతావరణం అందించడం మనందరి బాధ్యత. ముఖ్యంగా ప్రకృతిని ప్రేమించే ఎంపీ సంతోష్ గారు గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ని ప్రారంభించడం చాలా గొప్ప విషయం. ఇది ఎంతో అందమైన ఛాలెంజ్. మొక్కలు నాటాలనే ఛాలెంజ్‌ను ప్రజల్లోకి తీసుకువెళ్లడం గొప్ప విషయం. ఒక్క మొక్కతో మొదలైన ఈ ఛాలెంజ్ ఈరోజు కోట్లాది మొక్కలను దేశవ్యాప్తంగా నాటించిందని నేను విన్నాను. ఒకప్పుడు మొక్కలు పెంచండి పెంచండి అని ప్రజలను బతిమలాడాల్సి వచ్చేది. కానీ, ఇప్పుడు మాకు మొక్కలు ఇవ్వండి ఇవ్వండి అనే చైతన్య వచ్చింది. నా చిన్నతనంలో ఈ ప్రాంతంలో సర్కారు తుమ్మలు కనిపించేవి. ఇప్పుడు మొత్తం ఆకుపచ్చగా కనిపిస్తుంది. ఇది ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నినాదం, పట్టుదల వల్లే సాధ్యపడింది. దీనిని స్ఫూర్తిగా తీసుకొని సంతోష్ గారు కీసరగుట్ట పరిధిలో అడవి దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తున్నారు. నాకు కూడా పకృతి అంటే చాలా ఇష్టం. అందుకే నా ఇద్దరు కూతుళ్లకు భూమి, ఆరాధ్య అని పేర్లు పెట్టుకున్నాను. మీరందరూ చేతనైనంత వరకు చెట్లను పెంచండి. ఇప్పటికే మనం తాగే నీటిని కొనుక్కుంటున్నాం. కొన్ని రోజులు అయితే ఆక్సిజన్ సిలిండర్ కొనుక్కోవాల్సి వస్తుంది’’ అని చెప్పుకొచ్చారు. కాగా, తాను స్వీకరించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను మరో ముగ్గురికి ఆమె విసిరారు. నటి రేణు దేశాయ్, దర్శకుడు సంపత్ నంది, ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందంలను ఈ ఛాలెంజ్‌కు ఉదయభాను నామినేట్ చేశారు. ఈ ముగ్గురూ తన ఛాలెంజ్‌ను స్వీకరించి మూడు మొక్కలు నాటి వాటిని సంరక్షించాలి అని ఆమె కోరారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3elFDs8

No comments:

Post a Comment

'I've Received So Much Love'

'I always hope to find new stories, new characters, something I could challenge myself with.' from rediff Top Interviews https://i...