Tuesday, 18 February 2020

HIT Trailer: తెలిసిన కథే.. కానీ ఏదో కొత్తదనం ఉంది

నేచురల్ స్టార్ నాని నిర్మిస్తున్న ‘హిట్’ ట్రైలర్ రిలీజ్ అయింది. విశ్వక్ సేన్ కథానాయకుడిగా నటించారు. రుహానీ శర్మ హీరోయిన్. శైలేష్ కోనేరు దర్శకత్వం వహించారు. ఇక విషయానికి వస్తే.. మొన్న రిలీజ్ అయిన టీజర్‌లో ఏం చూపించారో అదే ట్రైలర్‌లోనే చూపించినట్లు తెలుస్తోంది. ప్రీతి అనే అమ్మాయి కనిపించకుండా పోవడం, ఆమె కనిపించడంలేదని తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడం, ఈ కేసును విక్రమ్ హ్యాండిల్ చేయడం చూపించారు. ఈ కేసులో పడి విక్రమ్ తాను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన అమ్మాయిని కోల్పోతాడు. హిట్ అంటే హోమిసైడ్ ఇన్వెస్టిగేషన్ టీం అని అర్థం అని మొన్న రిలీజ్ అయిన డైలాగ్ ప్రోమోలోనే విశ్వక్ సేన్ చిన్న క్లారిటీ ఇచ్చేసారు. ఇప్పటికే విడుదలైన ‘హిట్’ టీజర్ సినిమాపై అంచనాలను ఏర్పరిచింది. క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమా ఎలా ఉండబోతుందోనని ఇటు నాని అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరోవైపు విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో చిత్ర యూనిట్ ప్రచార కార్యక్రమాల జోరు పెంచింది. వేక్ సాగర్ సంగీతం సమకూర్చారు. ఎస్. మణికందన్ సినిమాటోగ్రఫీ అందించారు. అవినాష్ కొల్ల ఆర్ట్ డైరెక్టర్. గ్యారీ బీహెచ్ ఎడిటర్. నబ స్టంట్ కొరియోగ్రాఫర్. నాని సమర్పిస్తోన్న ఈ సినిమాకు ప్రశాంతి తిపిర్నేని నిర్మాత. ఈ సినిమా ఫిబ్రవరి 28న ప్రేక్షకుల ముందుకు వస్తోంది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2vMM0mG

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....