Sunday, 23 February 2020

స్పైరల్ రబ్బర్ బ్యాండ్స్‌తో జడ వేసుకుంటున్నా.. ఇవి తెలుసుకోండి..

ఆడవారు అలంకరణ విషయంలో ఎప్పడికప్పుడు కొత్త ట్రెండ్ ఫాలో అవుతూ ఉంటారు. హెయిర్ యాక్సెసరీస్ , ఫేస్ క్రీమ్స్ , మేకప్ ఇలా కొత్త వాటిని ప్రయత్నిస్తూ ఉంటారు. ముఖ్యంగా హెయిర్ స్టైల్స్ విషయంలో కొత్తగా ప్రయత్నిస్తారు. ఎందుకంటే ప్రతి అమ్మాయి తనకంటూ ప్రత్యేకంగా ఏదో ఒక హెయిర్ స్టైల్‌ ని ఫాలో అవుతూ ఉంటుంది. అకేషన్ ఏదైనా కామన్ హెయిర్ స్టైల్‌ తో మెరిసిపోతే.. ఇంకొందరు మాత్రం సందర్భానికి అనుగుణంగానే తమ హెయిర్ స్టైల్ ఉండేలా చూసుకుంటారు. మరికొంతమంది వెరైటీ హెయిర్ స్టైల్స్‌తో వారు మెరిసిపోవడమే కాకుండా.. చుట్టూ ఉన్నవారి చూపుని కూడా తమవైపు తిప్పుకుంటూ ఉంటారు. పోనీ టెయిల్‌తో అంటే ఇష్టపడే అమ్మాయిలు.. సాధారణంగా అమ్మాయిలు..జుట్టును పోనీటైల్ కట్టడానికి ఇష్టపడతారు. ఎందుకంటే సింపుల్‌గా ఉన్న హెయిర్ స్టైల్స్‌లో పోనీటెయిల్ ఒకటి. దీని కోసం పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు.. ఎందుకంటే దీన్ని ఈజీగా వేసుకోవచ్చు. అయితే పోనీ వేసుకునేటప్పుడు బానే ఉంటుంది కానీ దాన్ని విప్పేసిన తరువాత బ్యాండ్ పెట్టిన ప్రదేశంలో జుట్టు బంప్‌లా అయిపోతుంది. దీని వల్ల తరువాత ఏ జడ వేసుకుందామన్న జుట్టు సరిగా రాదు. వీటితో పాటు బంప్‌లా రావటం వల్ల చిరాగ్గా కనపడుతుంది. అయితే ఆలా బంప్‌ల రాకుండా పోనీటెయిల్ వేసేటప్పుడు జుట్టు అలా అవ్వటకుండా ఉండేందుకు స్విట్జర్లాండ్‌కు చెందిన సోఫీ ట్రెల్లెస్-ట్వేడే ఒక కొత్తగా ఆలోచించారు. అదే టెలిఫోన్ వైర్ తో పోనీ టైల్ వేసుంటే జుట్టు స్మూత్ గా ఉంటుందని, బంప్‌లా కాదని చెబుతున్నారు. స్పైరల్ రబ్బర్ బ్యాండ్స్.. స్విట్జర్లాండ్‌కు చెందిన 27ఏళ్ల సోఫీ పోనీ టెయిల్ వేసుకోటానికి ఈ విషయాన్ని కనుగొన్నారు. ఆమె యూనివర్సిటీలో చదివే రోజుల్లో ఒ పార్టీకి వెళ్లేటప్పుడు ఫోన్ వైర్‌తో జుట్టు వేసుకోవాలన్న ఆలోచన వచ్చిందట. అలా చేయడం వల్ల జుట్టు బంప్‌ల కాకుండా మామూలుగానే ఉందని, పడుకునేటప్పుడు కూడా ఇది ఇబ్బందిగా ఉండదని, తలనొప్పి వంటి సమస్యలు లేకుండా హెయిర్ గ్రిప్‌గా ఉంటుందని ఆమె తెలిపింది. ఆమె ఆలోచననే ఇప్పుడు చాలా మంది ఫాలో అవుతున్నారు. ఈ టెలీఫోన్ వైర్‌ని సెలబ్రిటీలు కూడా వాడుతున్నారు. ఆమె ఆలోచన ఇప్పుడు అనేక మందికి ఉపయోగకరంగా మారింది. అలా వచ్చిన ఈ బ్యాండ్‌లు ఇప్పుడు ప్రతి చోట దొరుకుతున్నాయి. సాధారణంగా బ్యాండ్ లను ఎక్కువ రోజులు వాడలేం, ఎందుకంటే అవి కొద్దీ రోజులకే సాగిపోతాయి. అయితే ఈ వైర్ బ్యాండ్ లు మాత్రం ఆలా కాదు. ఈ బ్యాండ్ లు సాగిన తరువాత కూడా మల్లి వాటి అసలు రూపానికి సులభంగా తిరిగి వస్తాయి. వీటివల్ల మరో ప్రయోజనం ఏంటంటే అది ఎలాంటి జుట్టు కైనా సరిగ్గా సరిపోతుంది. ఈ బ్యాండుల్లో పీచ్, నీలం, ఆకుపచ్చ, గోధుమ, రెయిన్‌బో, వివిధ రకాల రంగుల్లో ఇవి లభిస్తాయి.


from Beauty Tips in Telugu: అందం చిట్కాలు, Homemade Natural Beauty Tips Telugu - Samayam Telugu https://ift.tt/2Vj9ESv

No comments:

Post a Comment

'Congress Has Many Capable Leaders...'

'Maybe this has created some minor issues which can happen in any party.' from rediff Top Interviews https://ift.tt/lRkZP1O