Wednesday, 26 February 2020

కమల్ కావాలని ముద్దు పెట్టారంటే నమ్మరు, వదిలేయండి: రేఖ

పాతికేళ్ల క్రితం జరిగిన ఓ ఆసక్తికర సంఘటన ఇప్పుడు వైరల్ అవుతోంది. ప్రముఖ తమిళ సీనియర్ నటి రేఖ.. 20 ఏళ్ల క్రితం నటించిన ‘పున్నగాయ్ మన్నన్’ సినిమా షూటింగ్‌లో జరిగిన ఓ సంఘటన గురించి ఇటీవల వెల్లడించారు. ఈ సినిమాలో హీరోగా, రేఖ హీరోయిన్‌గా నటించారు. లెజండరీ డైరెక్టర్ కే. బాలచందర్ దర్శకత్వం వహించారు. అందులో కమల్, రేఖ గాఢంగా ప్రేమించుకుంటారు. అయితే ఇంట్లోవాళ్లు పెళ్లికి ఒప్పుకోలేదని చనిపోవాలని నిర్ణయించుకుంటారు. అయితే ఆత్మహత్య చేసుకునే సన్నివేశం తెరకెక్కిస్తున్నప్పుడు కమల్ హాసన్ రేఖ‌కు ముద్దుపెట్టేసారట. ఈ విషయాన్ని రేఖ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. తన అనుమతి లేకుండానే బాలచందర్, కమల్ హాసన్ ముద్దు సీన్‌ను పెట్టారని, ఆ తర్వాత కొన్ని రోజుల పాటు తనకు నిద్ర పట్టలేదని అన్నారు. అయితే ఆమె సరదాగా వెల్లడించిన ఈ విషయం కోలీవుడ్‌లో విపరీతంగా వైరల్ అవుతోంది. ప్రముఖ సింగర్ చిన్మయి శ్రీపాద కూడా దీనిపై స్పందించి.. ఇలాంటి దర్శకులు ఇప్పటికీ ఉన్నారని కామెంట్స్ చేసారు. అయితే సోషల్ మీడియాలో రేఖ ఇచ్చిన ఇంటర్వ్యూ రచ్చ పుట్టిస్తోంది. కమల్ హాసన్ రేఖ‌కు క్షమాపణలు చెప్పాలని నెటిజన్స్ డిమాండ్ చేసారు. అయితే ఈ విషయం ఎక్కడ సీరియస్ అవుతుందోనని భయపడి రేఖ దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలని అనుకున్నారు. READ ALSO: ‘దయచేసి ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేయండి. నా అనుమతి లేకుండా కమల్ హాసన్ ముద్దు పెట్టారంటే ఎవరూ నమ్మరు. ఈ విషయం నాకు, కమల్‌కు, బాలచందర్ సర్‌కి మాత్రమే తెలుసు. కానీ బాలచందర్ ఇప్పుడు బతికి లేరు. కాబట్టి నాకు కమల్ హాసన్ నుంచి ఎలాంటి సారీ అవసరంలేదు. నా అనుమతి లేకుండా ముద్దు పెట్టారు కానీ సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ విజయం అందుకుంది. నేను ఈ విషయాన్ని ఇప్పుడు ఎందుకు చెప్పానంటే ఒకవేళ లిప్ కిస్ సీన్ గురించి నాకు ముందే చెప్పి ఉంటే నేను ఒప్పుకునేదాన్ని కాను అని తెలియజేయడానికి మాత్రమే. దయచేసి ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేయండి’’ అని తెలిపారు. READ ALSO:


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2PwqHx0

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....