పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ‘పింక్’ రీమేక్‌లో నటిస్తున్న సంగతి తెలిసిందే. వేణు శ్రీరామ్ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. అభిమానులు ఎంతో ఉత్కంఠతో ఎదురుచూస్తున్న ఈ సినిమా ఫస్ట్‌లుక్ వచ్చేస్తోంది. సోమవారం ఫస్ట్‌లుక్‌ను రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే టీం నుంచి అఫీషియన్ కన్ఫర్మేషన్ రావాల్సి ఉంది. సినిమాకు లాయర్ సాబ్, లేదా వకీల్ సాబ్ అనే టైటిల్ అనుకుంటున్నారట. బాలీవుడ్‌లో మంచి విజయం అందుకున్న ‘పింక్’ సినిమాకు ఈ సినిమా రీమేక్‌గా రాబోతోంది. అందులో అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రలో నటించారు. ఇందులో అదే పాత్రను పవన్ పోషిస్తున్నారు. ఈ సినిమాలో మరో ముగ్గురు అమ్మాయిల పాత్రలు చాలా కీలకం. హిందీలో తాప్సి, కీర్తి కుల్హరి నటించిన పాత్రల్లో నివేదా థామస్, అంజలి నటిస్తున్నట్లు తెలుస్తోంది. దిల్ రాజు, బోనీ కపూర్ కలిసి సినిమాను నిర్మిస్తున్నారు. షూటింగ్ చాలా ఫాస్ట్‌గా జరిగిపోతోంది. పవన్ షూటింగ్స్‌కు హైదరాబాద్ వచ్చేందుకు దిల్ రాజు ఆయన కోసం ప్రత్యేకమైన విమానం కూడా ఏర్పాటుచేసినట్లు సమాచారం. READ ALSO: మార్చి 8న మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మొదటి పాటను రిలీజ్ చేయడానికి కూడా సన్నాహాలు చేస్తున్నారు. సినిమాకు తమన్ సంగీతం అందించారు. సినిమా కోసం కంపోజ్ చేసిన రెండు మూడు పాటలను పవన్‌కు వినిపించేందుకు ఇటీవల తమన్ ఆయన ఇంటికి వెళ్లారు. ఆయనకు కూడా పాటలు నచ్చాయట. సినిమాను మేలో రిలీజ్ చేసేయాలని సన్నాహాలు చేస్తున్నారు. READ ALSO:
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2POXGwL
No comments:
Post a Comment