Saturday, 29 February 2020

Hit Movie: ‘హిట్’ ఫస్ట్ డే కలెక్షన్స్.. ఈ లెక్కన నానికి లాభమా? నష్టమా?

హీరోగానే కాదు.. నిర్మాతగానూ సత్తా చాటుతున్నాడు నేచురల్ స్టార్ నాని. వాల్ పోస్టర్ బ్యానర్‌తో నిర్మాతగా మారిన నేచురల్ స్టార్ నాని లేటెస్ట్ మూవీ ‘హిట్’. మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా నటించిన ఈ చిత్రం శుక్రవారం నాడు విడుదలై పాజిటివ్ టాక్‌ను రాబట్టింది. శైలేష్ కొలను ఈ చిత్రంతో టాలీవుడ్ దర్శకుడిగా పరిచయం కాగా..‘చి.ల.సౌ ఫేమ్ రుహాని శర్మ హీరోయిన్‌గా నటించింది. మంచి బజ్‌తో థియేటర్స్‌కి వచ్చిన హిట్ మూవీ తొలిరోజు మంచి కలెక్షన్లే రాబట్టింది. ఈ నగరానికి ఏమైంది?, ఫలక్ నుమాదాస్ చిత్రాలతో నటుడిగా గుర్తింపు పొందిన విశ్వక్ సేన్ పూర్తి స్థాయిలో ఎస్టాబ్లిష్ కాకపోవడంతో ఈ చిత్రం తొలిరోజు ఓ మాదిరిగానే ఉన్నాయి. తొలిరోజు అన్ని ఏరియాలలోనూ కలిపి రూ. 1.29 కోట్లు రాబట్టింది. ఏరియాల వారిగా.. నైజాం- 0.66 కోట్లు సీడెడ్- 0.13 కోట్లు యూఏ- 0.12 కోట్లు గుంటూరు- 0.15 కోట్లు ఈస్ట్ గోదావరి- 0.06 కోట్లు వెస్ట్ గోదావారి- 0.05 కోట్లు క్రిష్ణా - 0.08 కోట్లు నెల్లూరు- 0.04 కోట్లు మొత్తం - 1.29 కోట్లు మొదటి 15 నిమిషాలు మీరు థియేటర్‌కి వచ్చికూర్చోండి.. ఆ తరువాత సీట్లలో మిమ్మల్ని నేను కూర్చోబెడతా.. వచ్చేటప్పుడు ఎక్కువ వాటర్ తాగి మాత్రం రావొద్దు. ఎందుకంటే టాయిలెట్ వస్తే మధ్యలో లేవలేరు. అంతలా ఉండబోతుంది ‘హిట్’ సినిమా అంటూ హీరో విశ్వక్ సేన్ చెప్పనంత రేంజ్‌లో ఈ సినిమా లేదు కాని.. సినిమా చూసిన ప్రేక్షకుల్ని ‘హిట్’ డిజప్పాయింట్ చేయదు అని మాత్రం చెప్పొచ్చు. కాగా తొలిరోజు ఓ మాదిరి కలెక్షన్లు రాబట్టిన ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ 4.40 కోట్ల మేరకు జరిగింది. సో.. తొలిరోజు రూ. 1.29 కోట్లు రాబట్టడటంతో బ్రేక్ ఈవెన్ సాధించి నానికి లాభాలు కురిపిస్తుందేమో చూడాలి.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2VyopRy

No comments:

Post a Comment

'I Wanted Waheeda Rehman For Ankur'

'I don't think Waheeda had the confidence that I could pull it off, so she said no.' from rediff Top Interviews https://ift.tt...