మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి, అపోలో ఫౌండేషన్, అపోలో లైఫ్ గ్రూపుల చైర్‌పర్సన్ ఉపాసన కొణిదెల సామాజిక సేవలో ముందుంటారనే విషయం అందరికీ తెలిసిందే. బిజినెస్‌లతో బిజీగా ఉండే ఉపాసన సామాజిక సేవ కోసం కూడా సమయాన్ని కేటాయిస్తున్నారు. పేదలకు తనవంతు సాయాన్ని అందిస్తున్నారు. అలాగే, సోషల్ మీడియా ద్వారా తన ఫాలోవర్స్‌కు అవగాహన కల్పిస్తున్నారు. తమవంతు సాయం అందించాలని కోరుతున్నారు. తాజాగా ఉపాసన పేదల కోసం మరో మంచి కార్యక్రమం చేపట్టారు. మనం మన కోసమే కాకుండా జనం కోసం కూడా ఆలోచించాలంటున్నారు ఉపాసన. మన జ్ఞాపకాలతో ముడిపడనివి, వాడేసిన వస్తువులు, దుస్తులు ఏమైనా ఉంటే వాటిని పేదలకు ఇచ్చే ఏర్పాటు చేయాలంటున్నారామె. తన ఇంట్లో వాడకం మొదలుపెట్టి 9 నెలలు దాటిన అలాంటి వస్తువులను జనం కోసం వినియోగించేందుకు సిద్ధం చేశారు. ఈ వస్తువులన్నింటినీ అమ్మి చారిటీ కోసం నిధులు సమకూరుస్తానని ఉపాసన సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ‘‘మీ దగ్గర కూడా ఇలాంటివి పాత వస్తువులు ఉంటే వాటిని పేదల కోసం ఇవ్వండి’’ అంటూ ఆమె పిలుపునిచ్చారు.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3coWDxc
No comments:
Post a Comment