స్టార్ నటి ఒకప్పుడు ముక్కుకు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఆమె మళ్లీ సర్జరీ చేయించుకున్నారట. ఇదవరకు ఆమెకు ఉన్న ముక్కుతో పోలిస్తే ఇప్పుడు కాస్త సన్నబడినట్లుగా కనిపిస్తోంది. అన్నింటి కంటే షాకింగ్ విషయం ఏంటంటే.. శ్రుతి చాలా సన్నబడిపోయారు. దాంతో శ్రుతికి ఏమైంది అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. దాంతో ఈ సారి ధైర్యంగా తాను ఎందుకు సర్జరీ చేయించుకోవాల్సి వచ్చిందో ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్లడించారు. "నేను ఇటీవల ఇన్‌స్టా్గ్రామ్‌లో పోస్ట్ చేసాను. కానీ చాలా సన్నగా ఉంది అంటూ చాలా మంది కామెంట్స్ చేసారు. ఇకపై ఈ కామెంట్స్ సహించబోం. నేను ఇప్పుడు పోస్ట్ చేసిన ఫొటోలు మూడు రోజుల గ్యాప్ మధ్యలో తీసినవి. నేను చెప్పబోయే విషయం గురించి ఇతర ఆడవాళ్లు కూడా ఫీలవుతారని అనుకుంటున్నారు. నాకు మెంటల్‌గా ఫిజికల్‌గా హార్మోనల్ సమస్యలు ఉన్నాయి. ఎన్నో ఏళ్ల పాటు నా హార్మోన్స్‌ని బ్యాలెన్స్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. అది అంత సులువు కాదు. బాధ భరించడం అంత సులువు కాదు, శారీరకంగా జరిగే మార్పులను తట్టుకోవడం అంత తేలిక కాదు" READ ALSO: "ఇతరులను వేలెత్తి చూపే హక్కు ఎవ్వరికీ లేదు. అవును నేను ప్లాస్టిక సర్జరీ చేయించుకున్నాను. ఈ విషయం చెప్పుకోవడానికి ఏమాత్రం సిగ్గుపడటంలేదు. నేను ప్లాస్టిక్ సర్జరీలను సపోర్ట్ చేయడంలేదు. అలాగని వాటికి వ్యతిరేకిని అని కూడా చెప్పను. మనం ఎలా బతకాలని అనుకుంటున్నాం అన్నదే ముఖ్యం. మన శరీరాల్లో, ఆలోచనల్లో వచ్చే మార్పులను స్వీకరించగలిగినప్పుడే మనకు మనం సాయం చేసుకున్నవాళ్లం అవుతాం. ప్రేమను పంచండి. రోజూ నన్ను నేను కాస్త ఎక్కువ ప్రేమించుకోవడమే నా జీవితంలో గొప్ప ప్రేమ కథ. మీ జీవితం కూడా అంతేనని ఆశిస్తున్నాను’’ అని తెలిపారు. శ్రుతి హాసన్ ‘లక్’ అనే బాలీవుడ్ సినిమాతో ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమా చూసినవారికి ఆమె సర్జరీకి ముందు ఎలా కనిపించేవారు క్లియర్‌గా తెలుస్తుంది. సర్జరీ తర్వాత శ్రుతి ముఖంలో చోటుచేసుకున్న మార్పులు నిజంగా ఆశ్చర్యాన్ని కలిగించాయి. ఎందుకంటే అందరికీ ప్లాస్టిక్ సర్జరీలు సెట్ అవ్వవు. కొందరికి బెడిసికొట్టి ఉన్న అందం పోగొట్టుకున్న సెలబ్రిటీలు కూడా ఉన్నారు. శ్రుతి ముక్కుకు మాత్రమే కాదు పెదాలకు కూడా బొటాక్స్ చేయించుకుంది. దాంతో అవి లావుగా అందంగా కనిపిస్తున్నాయి. READ ALSO:
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2I3dF64
No comments:
Post a Comment