రౌడీ బాయ్ హాట్ హీరోయిన్‌ను బైక్ ముందు కూర్చోబెట్టుకుని రాత్రి వేళ్లలో తెగ చక్కర్లుకొట్టాడు. నమ్మడం లేదా.. కావాలంటే పైనున్న ఫొటో చూడండి. ఇంతకీ ఆ అమ్మాయి ఎవరో తెలుసా? బాలీవుడ్‌లో మొన్న మొన్ననే అడుగుపెట్టిన లేద అందం అనన్యా పాండే. ‘సాహో’ సినిమాలో విలన్‌గా నటించిన ప్రముఖ బాలీవుడ్ నటుడు చుంకీ పాండే కూతురు. ‘ఫైటర్’ సినిమాలో విజయ్ దేవరకొండకు జోడీగా నటిస్తోంది. డ్యాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై కరణ్ జోహార్ సినిమాను సమర్పిస్తున్నారు. పూరీ కనెక్ట్స్ బ్యానర్‌పై పూరీ జగన్నాథ్, ఛార్మీ కలిసి సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాను తెలుగు, హిందీలో రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమాకు సంబంధించిన కొన్ని స్టిల్స్ లీకయ్యాయి. విజయ్ దేవరకొండ బైక్‌పై కూర్చుని ఉండగా, అనన్య ఆయన ముందు కూర్చుని ఉన్నారు. రాత్రివేళల్లో ఈ సీన్‌ను చిత్రీకరిస్తుండగా ఎవరో ఫొటోలు తీసారు. దాంతో ఈ ఫొటోలు కాస్తా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ సినిమాలో కీలక పాత్రలో ఓ ఇంటర్ నేషనల్ స్టార్‌ను నటింపచేసేందుకు ప్రయత్నిస్తున్నాడట పూరి. బాక్సింగ్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో లెజెండరీ బాక్సర్ మైక్ టైసన్‌తో కీలక పాత్రలో చేయించే ఆలోచనలో ఉన్నాడట. READ ALSO: అయితే మైక్ పూరి సినిమాలో అతిథి పాత్రలో నటించేందుకు అంగీకరిస్తాడా లేదా అన్న విషయం చూడాలి. ఈ సినిమాకు ముందుగా పూరి ఫైటర్ అనే టైటిల్‌ను అనుకున్నా.. ఆ టైటిల్ విషయంలో కరణ్ అభ్యంతరం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. ఫైటర్ చాలా నార్మల్‌గా ఉందని అన్ని భాషలకు సూట్ అయ్యే మరో డిఫరెంట్ టైటిల్ అయితే బెటర్ అన్న అభిప్రాయం వ్యక్తంచేశాడట. దీంతో ఫైటర్‌ను పక్కన పెట్టిన పూర్తి సినిమాను VD 10 అనే పేరుతోనే ప్రారంభించాడు. ఈ సినిమాలో విజయ్‌కు జోడిగా బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే నటించనుందన్న టాక్ వినిపిస్తోంది. READ ALSO:
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2TcrYvs
No comments:
Post a Comment