కొన్ని రోజుల క్రితం ‘భారతీయుడు 2’ షూటింగ్ సెట్‌లో జరిగిన ఘోర ప్రమాదం నుంచి సినిమా టీం ఇంకా కోలుకోలేకపోతోంది. రాత్రి షూటింగ్‌లో బిజీగా ఉండగా భారీ క్రేన్ మీద పడి ఇద్దరు అసిస్టెంట్ డైరెక్టర్లు, ఓ లైట్‌మెన్ అక్కడికక్కడే చనిపోవడం క్షణాల్లో జరిగిపోయాయి. దర్శకుడు శంకర్, కమల్ హాసన్, కాజల్ అగర్వాల్ వెంట్రుకవాసిలో ఈ ప్రమాదం నుంచి బయటపడ్డారు. అయితే ఈ విషయం సీబీఐ దాకా వెళ్లింది. సీబీఐ అధికారులు శంకర్‌ను చెన్నైలోని వేపేరి ప్రాంతానికి తీసుకెళ్లి రెండు గంటలకు పైగా విచారణ జరిపారట. అయితే శంకర్‌ను ఎలాంటి ప్రశ్నలు సంధించారు అన్న వివరాలు మాత్రం బయటికి రాలేదు. అయితే ‘భారతీయుడు 2’ సెట్స్‌లో జరిగిన ప్రమాదం విషయంలో తప్పంతా లైకా ప్రొడక్షన్స్‌దే అన్నట్లుగా కమల్ మాట్లాడారు. అంతేకాదు సెట్స్‌లో పనిచేస్తున్న ప్రతీ ఒక్కరికి అన్ని విషయాల్లోనూ భద్రత కల్పిస్తేనే మళ్లీ షూటింగ్‌లో పాల్గొంటాం అని లైకా ప్రొడక్షన్స్‌కు లేఖ రాసారు. అప్పటివరకు ఎవ్వరూ షూటింగ్‌లో పాల్గొనరు అని చెప్పారు. దాంతో లైకా ప్రొడక్షన్స్ సీఈఓ నీలకాంత్ నారాయణ్‌పూర్ ఆగ్రహం వ్యక్తం చేసారు. దాంతో లైకా ప్రొడక్షన్స్ సీఈఓ నీలకాంత్ నారాయణ్ పూర్ కమల్ మాటలను ఖండించారు. నిందలు తమపై వేయొద్దని అన్నారు. జరిగిన ఘటనలో అందరిదీ తప్పు ఉందని, ముఖ్యంగా సెట్స్‌లో ప్రతీ ఒక్కరి బాధ్యతను కమల్, శంకరే చూసుకునేవారని లేఖలో పేర్కొన్నారు. READ ALSO: ఇంత జరిగాక ఇప్పుడిప్పుడే షూటింగ్ మళ్లీ మొదలుపెట్టే అవకాశం లేదని స్పష్టంగా తెలుస్తోంది. ఈ కేసుపై సీబీఐ విచారణ జరుపుతోంది కాబట్టి అన్ని విషయాలు క్లియర్ అయ్యేవరకు షూటింగ్‌కు అనుమతి ఇచ్చే అవకాశం లేదు. మరోపక్క క్రేన్‌ను సెట్స్‌లో నిలిపిన వ్యక్తిని ఇటీవల పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే అతను ముందస్తు బెయిల్‌కు దరఖాస్తు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. READ ALSO:
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2T4eUrU
No comments:
Post a Comment