Wednesday, 26 February 2020

అయ్యో ‘అల..వైకుంఠపురములో’.. ఇలా ఎలా జరిగిందబ్బా.!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘’ సినిమాను 26న జెమిని టీవీ సంస్థకు చెందిన సన్ నెక్ట్స్ యాప్‌లో స్ట్రీమ్ చేస్తామని ఇదివరకే ప్రకటించారు. సాధారణంగా ఇలాంటి భారీ సినిమాలన్నీ అమెజాన్, నెట్‌ఫ్లిక్స్ యాప్స్‌లో రిలీజ్ చేస్తుంటారు. కానీ ఈ రెండు ఓటీటీలలో సినిమాను రిలీజ్ చేయమని అమెరికాకు చెందిన డిస్ట్రిబ్యూటర్లు ముందునేగా అనౌన్స్ చేసారు. అందుకే ఓవర్ సీస్‌లో ఈ సినిమా మిలియన్ల డాలర్ల కాసుల వర్షం కురిపించింది. కానీ ఇప్పుడు ఓ షాక్ న్యూస్ బయటికి వచ్చింది. సన్ నెక్ట్స్ యాప్‌లో రిలీజ్ అవ్వాల్సిన ‘అల వైకుంఠపురములో’ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ అయింది. ఒక్క ప్రకటన కూడా లేకుండా ఇది ఎలా జరిగిందో తెలీదు కానీ ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. అయితే డిస్ట్రిబ్యూటర్లే కావాలని ఓటీటీలో రిలీజ్ చేస్తున్నామని ముందుగానే చెప్పకుండా ఇలా చేసారా అన్న వార్తలు కూడా వెలువడుతున్నాయి. అయితే ఇప్పుడు నెట్‌ఫ్లి్క్స్‌లో ‘అల వైకుంఠపురములో’ రిలీజ్ అవడం వల్ల డిస్ట్రిబ్యూటర్లు వచ్చిన నష్టం ఏమీ లేదు. READ ALSO: ఎందుకంటే.... తెలుగు రాష్ట్రాలకు చెందిన డిస్ట్రిబ్యూటర్లతో పాటు అమెరికాలో సినిమా కొనుక్కున్నవాళ్లు కూడా తొలి 50 రోజుల్లోనే 8 కోట్లకు పైగా లాభాలు దక్కించుకున్నారు. కాబట్టి ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లో సినిమా రిలీజ్ అయినంత మాత్రాన పోయేది ఏమీ లేదు. సో అమెరికాలో ఉన్న తెలుగు ఆడియన్స్ ఎవరైనా ‘అల వైకుంఠపురములో’ సినిమాను థియేటర్‌లో చూడటం మిస్ అయివుంటే వెంటనే నెట్‌ఫ్లిక్స్‌లో డౌన్‌లోడ్ చేసుకుని ఎంజాయ్ చేసేయండి. READ ALSO:


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2I0qWfq

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....