Thursday, 27 February 2020

సునీల్ కొత్త సినిమా.. బాప్‌రే విలన్ గెటప్‌లో అదిరిపోయాడుగా!

ఈరోజు ప్రముఖ కమెడియన్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ‘కలర్ ఫొటో’ సినిమాలో ఆయన లుక్‌ను టీం రిలీజ్ చేసింది. లుక్‌లో సునీల్ విలన్ పాత్రలో నటిస్తున్నారు. జీపులో స్టైల్‌గా కూర్చుని సీరియస్‌గా కనిపిస్తున్న సునీల్ తన లుక్‌తో ఆకట్టుకుంటున్నారు. ఇందులో ఆయన పేరు ఎస్సై రామరాజు. ఈ సినిమాలో కమెడియన్ సుహాస్ కథానాయకుడిగా నటిస్తు్న్నారు. విజేత, పేపర్‌ బాయ్‌, మజిలీ, డియర్‌ కామ్రేడ్‌, ప్రతిరోజూ పండగే సినిమాల్లో తనదైన నటనతో ఆకట్టుకున్న సుహాస్‌ ఈ సినిమాతో హీరోగా పరిచయం కాబోతున్నారు. నటుడు సందీప్ రాజ్ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమాను హృదయ కాలేయం సినిమాకు దర్శకత్వం వహించిన స్టీవెన్‌ శంకర్‌ అలియాస్‌ సాయి రాజేష్, లౌక్యా ఎంటర్‌టైన్మెంట్స్‌తో కలిసి నిర్మిస్తున్నాడు. చాయ్‌ బిస్కెట్‌ యూట్యూబ్‌చానల్‌ కోసం కలిసి పనిచేసిన సుహాస్, సందీప్‌ల కాంబినేషన్‌లో సినిమా తెరకెక్కుతుండటంతో ఈ మూవీపై ఆసక్తి నెలకొంది. సుహాస్‌కు జోడిగా ఛాందిని చౌదరి నటిస్తున్నారు. ఈ సినిమాకు కీరవాణి తనయుడు కాళ భైరవ సంగీత దర్శకత్వం వహిస్తున్నారు. READ ALSO: ఒకప్పుడు ఇండస్ట్రీలో స్టార్ కమెడియన్‌గా గుర్తింపు తెచ్చుకున్న సునీల్ ఆ తర్వాత ‘అందాల రాముడు’, ‘మర్యాద రామన్న’ సినిమాలతో హీరోగా మారారు. హీరోగానూ మంచి పేరు తెచ్చుకున్నారు కానీ ఆ పొజిషన్‌ను నిలబెట్టుకోలేకపోయారు. హీరో అంటే సిక్స్ ప్యాక్ బాడీ కంపల్సరీ అన్నట్లు.. సునీల్ కూడా రిస్క్ తీసుకుని మరీ కండలు పెంచేసారు. దాంతో అది ఆయన ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపింది. అనారోగ్య సమస్యలు వచ్చాయి. ఈ విషయం పక్కనబెడితే.. ఇప్పుడు సునీల్ విలన్ పాత్రలతో మెప్పించాలని అనుకుంటున్నారు. ఆల్రెడీ ఆయన ‘డిస్కో రాజా’ సినిమాలో విలన్ పాత్రలో నటించారు. ఆయనలో ఈ కోణం కూడా ఉందని ఇప్పటివరకు ఆడియన్స్‌కు తెలీదు. ఇప్పుడు మరోసారి ‘కలర్ ఫొటో’ సినిమాతో తనలోని రౌద్రాన్ని చూపించబోతున్నారు సునీల్. ఆయన ఇలాగే మరిన్ని మంచి పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తూనే ఉండాలని కోరుకుంటూ మరోసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుదాం. READ ALSO:


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2T5RzWD

No comments:

Post a Comment

'I Wanted Waheeda Rehman For Ankur'

'I don't think Waheeda had the confidence that I could pull it off, so she said no.' from rediff Top Interviews https://ift.tt...