మస్కరా ఇలా.. ముఖానికి అందాన్ని ఇచ్చేవి కళ్ళు. ఆ కళ్ళకు మెరుగులు దిద్దితే మరింత అందంగా కనిపిస్తాయి. అందుకే మగువలు కళ్ళకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఐబ్రోస్, మస్కరా , లైనర్ వంటివి కళ్ళకి మరింత అందాన్ని ఇస్తాయి. అయితే, చాలా మంది వీటిని ఉపయోగిస్తారు. కానీ, సరైన పద్దతిలో మాత్రం కాదు అయితే అలాంటి వారు ఏం చేస్తే కళ్ళు మరింత అందంగా, కనురెప్పలు ఒత్తుగా కనిపిసాయి. ఐమేకప్ విషయానికి వస్తే, కనురెప్పలు ముఖానికి చాలా తేడా ఉంటుంది. అయితే, చాలా మందికి కనురెప్పలు ఒత్తుగా ఉండవు. అయితే వాటి కోసం అనేక మంది ఆర్టిఫీషియల్ కనురెప్పలు పెట్టుకుంటారు. అయితే చాలా మందికి అలా పెట్టుకోవడం ఇష్టం ఉండదు. అలంటి వారు తమ కళ్ళకు మస్కారా, కాటుకని ఉపయోగించి కనురెప్పలు ఒత్తుగా కనపడేలా చేయొచ్చు. అందుకోసం అద్భుతమైన చిట్కాలు. వీటిని పాటించడం ద్వారా మీరు ఆర్టిఫీషియల్ కనురెప్పలు పెట్టుకోకుండా కనురెప్పలు ఒత్తుగా కనిపించేలా చేయొచ్చు. కనురెప్పలు అందంగా కనిపించేందుకు కర్లింగ్ అద్భుతమైన చిట్కా.. ఎందుకంటే ఇవి కను రెప్పలకి మంచి షేప్‌ని తీసుకొస్తాయి. అయితే దీన్ని ఎలా ఉపయోగిస్తే రెప్పలు ఒత్తుగా కనిపిస్తాయంటే... మీ కనురెప్పలకి ఏదైనా బ్రాండ్‌ని ఉపయోగించే ముందు, ముందుగా మీ కనురెప్పలను కర్లింగ్ చేయడం ద్వారా వాటికి ఒక ఆకారం వచ్చి అందంగా కనిపిస్తాయి. ఇలా చేస్తే మీ కనురెప్పలకు సహజమైన లిఫ్ట్ ఇవ్వడానికి సాయపడుతుంది. మీరు కనురెప్పల కర్లర్స్‌ని వాడే ముందు 5 నుండి 10 సెకన్ల పాటు బ్లో డ్రైయర్‌తో వేడి చేయండి. దీంతో మీ కనురెప్పలను క్విర్క్ కర్ల్ ఇవ్వడం ఈజీ అవుతుంది. అయితే, కర్లర్ చాలా వేడిగా ఉండకుండా చూసుకోండి. మగువలు రెగ్యులర్‌గా ఉపయోగించే బ్యూటీ ప్రొడక్ట్స్‌లో ఐలైనర్ కూడా ఒకటి. ఐలైనర్ వేసుకోవటం వల్ల కళ్ళు మరింత అందంగా కనిపిస్తాయి. అయితే ఇది సరిగ్గా వేసుకోకపోవడం వల్ల కళ్లు అందంగా కనిపించవు. ముఖ్యంగా కనురెప్పలు సరిగ్గా కనిపించవు , అందుకే దీన్ని వేసుకోవటం కోసం ఓ చిట్కా... ఐలైనర్ వేసుకునేటప్పుడు మీ కనురెప్పలు అందంగా, ఒత్తుగా కనిపించాలంటే. మీరు ఐ లైనర్‌ని మీ కనురెప్పల పైనే సన్నని రేఖల అప్లై చేయండి. దీని ద్వారా మీ రెప్పలు ఒత్తుగా కనిపిస్తాయి. ఆడవాళ్లకు కాటుకకి దగ్గర స్నేహం. ఎందుకంటే, మగువలు ఎక్కువగా వాడే బ్యూటీ ప్రొడక్ట్స్‌లో కాటుక కూడా ఒకటి. ఎంత మేకప్ వేసిన అది కళ్ళకు కాటికతోనే పూర్తవుతుంది. కాటుక పెట్టుకుంటే ముఖంలో గ్లో వస్తుంది. అంతేకాదు, ఈ కాటుక మీ కనురెప్పలను ఒత్తుగా కనిపించేందుకు సాయపడుతుంది. అయితే దీనికోసం పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. దీనికో మార్గం ఉంది. ఆడవాళ్లు రెగ్యులర్‌గా కళ్ళకు కాటుక పెడతారు. కింద రెప్పలకు పెడతారు కానీ పైరెప్పలకు కాటుక పెట్టారు. అయితే కాటుక పై రెప్పలకు పెట్టడం ద్వారా మీకనురెప్పలకు మరింత అందాన్ని ఇస్తాయి. కనురెప్పలు ఒత్తుగా కనిపించేందుకు కాటుకను పై వాటర్ లైన్ కి రాయడం వల్ల మీ కనురెప్పలు ఒత్తుగా కనిపించడానికి సహాయపడుతుంది. మస్కారా వేస్తే మీ కంటికే కాదు.. మీ ముఖానికి అందం వస్తుంది. మేకప్‌లో కంటి అందమే కీ రోల్. కాబట్టి మస్కారాను డార్క్‌గా వేసుకోండి . మస్కారా వేయడంతో ఐ మేకప్ కంప్లీట్ అవుతుంది. అయితే చాలా మంది మాస్కరాకి బదులుగా ఆర్టిఫీషియల్ ఐ లాషెస్ ఉపయోగిస్తారు. కానీ, అలా కాకుండా.. ఈ చిన్న చిట్కా ద్వారా మీ కను రెప్పలు ఒత్తుగా కనిపిస్తాయి. ఇందుకోసం మీరు చేయాల్సింది.. కనురెప్పలకి మస్కారా వేసేటప్పుడు ఎక్కువ కోటింగ్స్ వేయండి. ఇలా వేయటం వల్ల కను రెప్పలు ఒత్తుగా కనిపిస్తాయి. అంతేకాక మస్కరాను ఎక్కువ కోటింగ్స్ వేయడం వల్ల కను రెప్పలు పొడవుగా మరియు ఒత్తుగా కనిపిస్తాయి. మరియు కను రెప్పలు ఒత్తుగా కనిపించడానికి వేర్వేరు మాస్కరాలను కూడా వాడచ్చు. మీ కనురెప్పలు ఒత్తుగా కనిపించాలంటే.. షాడో బ్రష్‌తో బేబీ పౌడర్‌ను మీ కనురెప్పలకు రాయండి. పౌడర్ రాసిన తరువాత రెప్పలు పొడిగా అవుతాయి. పొడిగా ఉన్న రెప్పలకు మాస్కరాను అప్లై చెయ్యండి. ఇది మీ కనురెప్పలను ఒత్తుగా కనపడేందుకు సహాయపడుతుంది.
from Beauty Tips in Telugu: అందం చిట్కాలు, Homemade Natural Beauty Tips Telugu - Samayam Telugu https://ift.tt/2T8ZBhI
No comments:
Post a Comment