Friday 28 February 2020

ఇక బెడ్రూం సీన్లలో నటించే ఓపిక నాకు లేదు: సిద్ధార్థ్ హీరోయిన్

ఫలానా హీరోయిన్ సెక్స్ సీన్లలో, రొమాంటిక్ సీన్లలో నటిస్తే ఇక ఆమెను ఇలాంటి సన్నివేశాల్లో చూపించాలని అనుకుంటారు. కొందరేమో ఏ సన్నివేశం అయితే ఏంటి అవకాశం వచ్చిందా లేదా అని నటించేస్తూ ఉంటారు. మరికొందరు మాత్రం ఎప్పుడూ ఇవే సీన్లా, నాలో నటిని గుర్తించలేరా అని బాధపడుతుంటారు. అలాంటివారిలో ఒకరు ప్రముఖ తమిళ నటి . ‘గృహం’, ‘విశ్వరూపం 2’ సినిమాల్లో రొమాంటిక్ డోస్ కాస్త ఎక్కువగా ఉన్న సన్నివేశాల్లో నటించారు ఆండ్రియా. ఇటీవల రిలీజ్ అయిన ‘వడా చెన్నై’ సినిమాలో కూడా ఆండ్రియా పాత్ర బెడ్‌రూం సీన్లకే పరిమితం అయిపోయింది. అయితే ఇక ఈ సీన్లతో విసిగిపోయానని అంటున్నారు ఆండ్రియా. తనకు చాలాకాలంగా ఇలాంటి సన్నివేశాలే వస్తున్నాయని, ఇక తన వల్ల కాదని అన్నారు. తన పాత్ర గొప్పగా ఉండి, బెడ్ రూం సీన్లలో నటించాల్సిన అవసరం ఉంటే తప్పకుండా చేస్తాను కానీ, ఊరికే బోల్డ్ సీన్లలో నటించమంటే మాత్రం ఇక నుంచి నో చెప్పాలని అనుకుంటున్నట్లు తెలిపారు. మంచి పాత్రలతో తన వద్దకు వస్తే రెమ్యునరేషన్ తగ్గించుకోవడానికైనా సిద్ధంగా ఉన్నానని పేర్కొన్నారు. ప్రస్తుతం ఆండ్రియా ‘మాస్టర్’ సినిమాలో నటిస్తున్నారు. దళపతి విజయ్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ సినిమాకు లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. READ ALSO: మాళవిక మోహనన్ మరో హీరోయిన్ పాత్రను పోషిస్తున్నారు. వేసవిలో సినిమా రిలీజ్ కాబోతోంది. ఆండ్రియా నటి మాత్రమే కాదు సింగర్ కూడా. సూపర్‌స్టార్ మహేష్ బాబు, కియారా అద్వానీ నటించిన ‘భరత్ అనే నేను’ సినిమాలో ‘అరెరె ఇది కలలా ఉన్నదే’ పాటను పాడింది ఆండ్రియానే. READ ALSO:


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2I21c2t

No comments:

Post a Comment

'Don't Involve My Family!'

'My weakness is my family, and the people I love.' from rediff Top Interviews https://ift.tt/2lOucDz