‘బాబూ నూ సెప్పు.. వాడ్ని కొట్టమని డప్పు’.. సూపర్‌స్టార్ మహేష్ బాబు అభిమానులు థియేటర్లలో పూనకాలతో ఊగిపోయిన పాట ఇది. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమా సంక్రాంతికి విడుదలై బ్లాక్ బస్టర్ విజయం అందుకుంది. ఈ సినిమా రిలీజ్ అయ్యి ఈరోజుకి సక్సెస్‌ఫుల్‌గా 50 రోజులు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ‘మైండ్ బ్లాక్’ ఫుల్ సాంగ్‌ని రిలీజ్ చేసింది టీం. ఈ పాట రిలీజ్ అయిన గంటలోనే నాలుగు లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. పాటకు ఉన్న క్రేజ్ అలాంటిది మరి. మహేష్ ఇలాంటి ఒక ఊర మాస్ పాట చేస్తాడని ఫ్యాన్స్ ఎప్పుడూ ఊహించలేదు. లుంగీ కట్టుకుని మరీ మహేష్ మాస్ స్టెప్పులకు వేసాడంటే ఇక ఫ్యాన్స్ ఆగుతారా. అనిల్ రావిపూడి సరిలేరు నీకెవ్వరు సినిమాకు సంబంధించిన ప్రెస్ మీట్ పెట్టినప్పుడే ఫ్యాన్స్ మరిచిపోలేని మాస్ పాట అందిస్తానని చెప్పాడు. ఆయన ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాడు. అసలు మహేష్‌కి డ్యా్న్స్ వచ్చా అని అడిగినవారంతా ఈ పాట చూసి ముక్కున వేలేసుకుంటున్నారు. సినిమా 50 రోజులు సక్సెస్‌ఫుల్‌గా ఆడిన సందర్భంగా అనిల్ రావిపూడి ఎమోషనల్ పోస్ట్ ఒకటి పెట్టారు. READ ALSO: ‘మరో మర్చిపోలేని సంక్రాంతి. నేనెప్పటికీ మర్చిపోలేని ప్రయాణం. నేను సూపర్‌స్టార్‌తో కలిసి చేసిన జర్నీ 50 రోజులు పూర్తిచేసుకుంది. ఈ సినిమాకు నాకు చాలా ప్రత్యేకం. తెలుగు రాష్ట్రాల్లో ‘నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్’, ‘నీకు అర్థమవుతోందా’, ‘రమణా.. లోడ్ ఎత్తాలిరా’ డైలాగులు వైబ్రేషన్ క్రియేట్ చేసాయి. ప్రేక్షకులూ సరిలేరు మీకెవ్వరూ’ అని పేర్కొన్నారు.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3afQaTb
No comments:
Post a Comment