Sunday, 23 February 2020

క్రికెటర్‌తో పెళ్లి.. గట్టిగా రియాక్షన్ ఇచ్చిన అనుష్క

సినీ ప్రముఖుల పెళ్లి గోల ఎప్పుడూ ఇంట్రెస్టింగ్‌గానే ఉంటుంది. ఇక కాస్త పెద్ద సెలబ్రిటీలే అయితే వారికి పెళ్లయ్య వరకు రోజూ ఏవో ఒక రూమర్స్ వస్తూనే ఉంటాయి. ప్రస్తుతం శెట్టి పెళ్లి గురించి టాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ నడుస్తోంది. ఓ క్రికెటర్‌తో అనుష్క పెళ్లి జరగబోతోందని నెల రోజులుగా వార్తలు వస్తున్నాయి. సందర్భం వచ్చినప్పుడు రూమర్స్‌పై క్లారిటీ ఇవ్వచ్చులే అనుకున్న అనుష్క మొత్తానికి మీడియా ద్వారా ఆ క్లారిటీ ఇచ్చేసారు. ‘‘మొన్నటివరకు నేను ఎవరితోనో లవ్‌లో ఉన్నాను అని రాసేసారు. ఇప్పుడు పెళ్లి కుదరింది అని రాసేస్తున్నారా? నేను ఏ క్రికెటర్‌తోనూ డేటింగ్‌లో లేను. ఇలాంటి రూమర్స్ రాసేముందు కాస్త క్రాస్ చెక్ చేసుకోండి. నా ప్రేమ, పెళ్లికి సంబంధించిన రూమర్స్ రోజూ వస్తూనే ఉంటాయి. మీడియా దయ వల్ల ఇప్పటికే నాకు ఎన్నో సార్లు పెళ్లైంది. నా పెళ్లి సంగతి నా తల్లిదండ్రులకే అప్పగించేసాను. వారు ఎవర్ని చేసుకోమంటే అతన్నే చేసుకుంటాను’’ అన్నారు. READ ALSO: కొన్నాళ్ల వరకు ప్రభాస్, అనుష్క డేటింగ్‌లో ఉన్నారన్న వార్తలు బాగా వైరల్ అయ్యాయి. ఈ వార్తలపై అనుష్క కంటే ప్రభాసే ఎక్కువగా స్పందించారు. అలాంటిదేమీ లేదురా బాబూ అని ఎన్నిసార్లు చెప్పినా మీడియా వర్గాలు పదే పదే ఇవే ప్రశ్నలు అడిగేవి. దాంతో ఓసారి ప్రభాస్‌కు ఒళ్లుమండింది. ‘ఈ రూమర్స్‌కి ఫుల్ స్టాప్ పడాలంటే అనుష్కైనా పెళ్లి చేసుకోవాలి లేదా నేనైనా చేసుకోవాలి. అప్పుడే మీడియా ఈ ప్రశ్నలకు దూరంగా ఉంటుంది’ అన్నారు. ‘భాగమతి’ తర్వాత బాగా గ్యాప్ తీసుకున్న అనుష్క ప్రస్తుతం ‘నిశ్శబ్దం’ అనే సినిమాలో నటిస్తున్నారు. హేమంత్ మధుకర్ దర్శకత్వం వహిస్తున్నారు. మాధవన్ కథానాయకుడిగా నటించారు. ఇందులో అనుష్క మూగ అమ్మాయి పాత్రలో నటించారు. అంజలి, సుబ్బరాజు, షాలిని పాండే, శ్రీనివాస్ అవసరాలతో పాటు మైఖెల్ మ్యాడ్సెన్ అనే హాలీవుడ్ నటుడు కూడా నటించారు. READ ALSO:


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/395JLtq

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....