పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పపుడా అని ఎదురుచూస్తోన్న క్షణం వచ్చేస్తోంది. సుమారు రెండేళ్ల విరామం తర్వాత సినిమా పోస్టర్‌పై పవన్ బొమ్మ కనబడబోతోంది. పవన్ కళ్యాణ్ 26వ సినిమా, బాలీవుడ్ బ్లాక్ బస్టర్ ‘పింక్’ తెలుగు రీమేక్ ఫస్ట్‌లుక్ వచ్చేస్తోంది. సోమవారం (మార్చి 2న) సాయంత్రం 5 గంటలకు #PSPK26 ఫస్ట్‌లుక్‌ను విడుదల చేస్తున్నట్టు చిత్ర నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ప్రకటించింది. ఈ మేరకు ఆదివారం ప్రీ లుక్ పోస్టర్‌ను విడుదల చేసింది. ‘అజ్ఞాతవాసి’ తరవాత పవన్ కళ్యాణ్ రాజకీయాలతో బిజీ అయిపోయారు. ‘జనసేన’ పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లే పనిలో పడి సినిమాలను పూర్తిగా వదిలేశారు. అయినప్పటికీ 2019 ఎన్నికల్లో తన పార్టీని గెలిపించుకోలేకపోయారు. ఎన్నికల తర్వాత కూడా చాలా రోజులు సినిమాల వైపు చూడలేదు. అయితే, పార్టీని నడపడానికి డబ్బులు కావాలి కాబట్టి.. నిధులు సమకూర్చుకోవడానికి సినిమాలే ఆధారమని భావించి మళ్లీ ముఖానికి రంగు వేసుకున్నారు. వరుసగా మూడు ప్రాజెక్టులను అంగీకరించారు. వాటిలో మొదటిది ‘పింక్’ రీమేక్. Also Read: బాలీవుడ్ నిర్మాత, శ్రీదేవి భర్త బోనీ కపూర్ ఈ సినిమాను సమర్పిస్తున్నారు. బేవ్యూ ప్రాజెక్ట్స్‌తో కలిసి శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. శ్రీరామ్ వేణు దర్శకత్వం వహిస్తున్నారు. తమన్ సంగీతం సమకూరుస్తున్నారు. ఈ సినిమాకు ఇంకా టైటిల్ ఖరారు చేయలేదు. ‘వకీల్ సాబ్’ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. మరి రేపు విడుదల చేసే ఫస్ట్‌లుక్‌లో సినిమా టైటిల్‌ను ప్రకటిస్తారో లేదో చూడాలి. గెట్ రెడీ పవర్ స్టార్ ఫ్యాన్స్.. రేపు రచ్చ రచ్చే!!
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2wl3ZkM
No comments:
Post a Comment