‘కార్తికేయ’ చిత్రం ద్వారా డైరెక్టర్ చందు మొండేటి టాలీవుడ్‌లో తన ప్రయాణాన్ని మొదలుపెట్టారు. తొలి చిత్రంతోనే తన మార్క్ చూపించారు. పామును హిప్నటైజ్ చేయడమనే కొత్త కాన్సెప్ట్‌ను తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేశారు. ఈ సినిమా యంగ్ హీరో నిఖిల్ కెరీర్‌లో సూపర్ హిట్‌గా నిలిచిపోయింది. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ వస్తోంది. ‘కార్తికేయ 2’ పేరిట వస్తోన్న ఈ సినిమాను మార్చి 2న తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రారంభించనున్నారు. అయితే, సినిమా ప్రారంభానికి ముందు ఒక కాన్సెప్ట్ వీడియోను విడుదల చేశారు. ఈ కాన్సెప్ట్ వీడియో చూస్తుంటే చందు మొండేటి మరో కొత్త విషయంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నట్టు అర్థమవుతోంది. కొన్ని వేల సంవత్సరాల క్రితం నాటి రహస్యం ఆధారంగా ఒక సరికొత్త విషయాన్ని చెప్పబోతున్నారు. ‘‘కలియుగే ప్రథమ పాదే, జంబూ ద్వీపే, భరతవర్షే, భరత ఖండే. 5118 ఏళ్ల క్రితం ముగిసిన ఒక యుగం. ఆ యుగ అనంత జ్ఞాన సంపద. అందులో దాగి ఉన్న ఒక రహస్యం. ఈ యుగంలో అన్వేషణ. స్వార్థానికొక.. సాధించడానికొక.. అతని సంకల్పానికి సాయం చేసినవారెవరు? దైవం మనుష్య రూపేణా’’ అంటూ సాగే వాయిస్ ఓవర్‌తో ఈ కాన్సెప్ట్ వీడియో చాలా ఆసక్తికరంగా ఉంది. Also Read: కాగా, ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్లపై టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్నారు. వివేక్ కూచిభొట్ల సహ నిర్మాత. కాలభైరవ సంగీతం సమకూరుస్తున్నారు. కార్తీక్ ఘట్టమననేని సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. అయితే, ఈ చిత్రంలో నిఖిల్ సరసన నటించే హీరోయిన్ ఎవరో చిత్ర యూనిట్ ఇంకా ప్రకటించలేదు. త్వరలోనే దీనిపై ప్రకటన చేయనున్నారు. రేపు తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రత్యేక పూజాకార్యక్రమాలు నిర్వహించి ఈ చిత్రాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఈ ఏడాది ఆఖరిలో సినిమాను విడుదల చేయనున్నారు.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3aiW06l
No comments:
Post a Comment