ఫిల్మ్ ఇండస్ట్రీలో లైంగిక వేధింపుల గురించి ఇప్పటికే చాలా మంది నటీమణులు స్పందించారు. చాలా ఆరోపణలు చేశారు. వీళ్లలో తమిళ నటి వరలక్ష్మీ శరత్‌కుమార్ కూడా ఉన్నారు. ‘మీటూ’ ఉద్యమానికి సపోర్ట్ చేసిన కొంత మంది నటీమణుల్లో ఈమె ఒకరు. అయితే, పరిశ్రమలో లైంగిక వేధింపుల గురించి మరోసారి వరలక్ష్మి స్పందించారు. తాజాగా ఓ టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తమిళ ఫిల్మ్ ఇండస్ట్రీలో తాను లైంగిక వేధింపులను ఎదుర్కొన్నానని చెప్పారు. చాలా మంది నిర్మాతల నుంచి తాను ఇలాంటి ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొన్నానన్నారు. తన ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ తెలిసి, హీరోగా, రాజకీయ నాయకుడిగా తన తండ్రి శరత్‌కుమార్ హోదా గురించి తెలిసి కూడా తనను సెక్సువల్ ఫేవర్ అడిగే ధైర్యం చేశారని వరలక్ష్మి చెప్పుకొచ్చారు. అయితే ఇలాంటి సెక్సువల్ ఫేవర్స్‌ను తాను తిరస్కరించానని, అందుకే ఇండస్ట్రీలో తన కెరీర్ ప్రారంభంకావడం ఆలస్యమైందని వివరించారు. ఇండస్ట్రీకి వచ్చే అమ్మాయిలు ఇలాంటి వాటికి కచ్చితంగా ‘నో’ చెప్పాలని, ధైర్యంగా బయటికి వచ్చి ఫిర్యాదు చేయాలని సూచించారు. Also Read: ‘‘ఇండస్ట్రీలో అవకాశాల కోసం, కెరీర్‌లో ఎదగడం కోసం ఆ దారినే ఎంపిక చేసుకున్నవాళ్లను మనం ప్రశ్నించలేం. నిజానికి అలాంటి నిర్ణయం తీసుకోవాలంటే మానసికంగా చాలా దృఢంగా ఉండాలి. నేనిచ్చే సలహా ఏంటంటే.. నాలా సరైన అవకాశం వచ్చేంత వరకు వేచి చూడండి. మీకు అవకాశం వచ్చినప్పుడు మీ ప్రతిభను నిరూపించుకోండి’’ అని వరలక్ష్మి వెల్లడించారు. Also Read: కాగా, హీరోయిన్‌గా పెద్దగా రాణించలేకపోయిన వరలక్ష్మి శరత్‌కుమార్ ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, విలన్‌గా బిజీ అయిపోయారు. దళపతి విజయ్ హీరోగా వచ్చిన ‘సర్కార్’ సినిమాలో లేడీ విలన్‌గా వరలక్ష్మి నటన ఆకట్టుకుంది. ‘తెనాలి రామకృష్ణ బీఏబీఎల్’ సినిమాతో వరలక్ష్మి టాలీవుడ్‌లోకి కూడా అడుగుపెట్టారు. ప్రస్తుతం ఆమె ‘క్రాక్’ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నారు. రవితేజ హీరోగా తెరకెక్కుతోన్న ఈ సినిమా మే 8న ప్రేక్షకుల ముందుకు రానుంది.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3ci3qsi
No comments:
Post a Comment