Tuesday 18 February 2020

ఈ ఐదు పాటిస్తే చాలు మేకప్‌ లేకపోయినా మెరిసిపోతారు..

వృద్ధాప్యం అనేది ప్రతి ఒక్కరి జీవితంలోని అత్యంత చేదు అనుభవం. అయితే వయస్సు అయ్యే కొద్దీ శరీరం మరియు చర్మంపై మార్పులు వస్తూ ఉంటాయి. ఆ మార్పు ఎవ్వరు స్వాగతించలేరు. కానీ ప్రస్తుతం ఆహార అలవాట్లు, కాలుష్యం, ఒత్తిళ్ల వల్ల చిన్న వయసులోనే చర్మం పై ముడతలు, మొటిమలు వంటివి వస్తున్నాయి. అయితే చిన్న వయస్సులోనే చర్మంలో మార్పులు కనిపిస్తే దాన్ని యాంటీ ఏజింగ్ సమస్యలు అంటారు. కారణాలు ఏవైనా, అలా కనిపంచడం ఎవ్వరికీ ఇష్టం ఉండదు. ఎందుకంటే యవ్వనంగా కనిపించాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. వృద్ధాప్యం అనేది ఒత్తిడి, సూర్యరశ్మి లేదా సరైన చర్మ సంరక్షణ లేకపోవడం, చాలా కారణాలు చర్మ ఆరోగ్యాన్ని తీవ్రతరం చేస్తాయి. ముడతలు, మచ్చలేని చర్మం మరియు ముడతలు వంటి సమస్యలతో పోరాడటానికి, చర్మం వృద్ధాప్య లక్షణాలను దూరం చేసే అలవాట్ల గురించి తెలుసుకుందాం.. బ్యూటీఫుల్ స్కిన్ కావాలంటే.. అందమైన, కాంతివంతమైన చర్మ కోసం ప్రతి ఒక్కరు ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. అయితే అది లోపల నుంచి వచ్చినప్పుడు ఎక్కువ కాలం ఉంటుంది. సౌందర్య ఉత్పత్తుల వల్ల కూడా చర్మం కాంతివంతంగా ఉంటుంది అయితే ఆ సౌందర్య ఉత్పత్తులు వాడటం ఆపేసిన వెంటనే మళ్లీ చర్మం ముందు స్థితి కంటే మరింత భయంకరంగా తయారవుతుంది. అయితే చర్మం ఎల్లప్పుడూ ఆరోగ్యాంగా మరియు కాంతివంతంగా ఉండాలంటే మీరు తీసుకోవాల్సిన కొన్ని ఆహార జాగ్రత్తలు ... పండ్లు, కూరగాయలు, డ్రైఫ్రూట్స్ ముఖ్యం.. అందమైన చర్మం కోసం అనేక మంది రకరకాల క్రీములు, ఫేస్ ప్యాక్ లను ఆశ్రయిస్తారు. అయితే చర్మ సౌందర్యం అనేది సౌందర్య ఉత్పత్తుల మీద ఆధారపడి ఉండదు. చర్మ ఆరోగ్యానికి మీ ఆహారం ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఆరోగ్యమైన చర్మం కోసం ఆరోగ్యకరమైన ఆహార అలవాట్లు ముఖ్యం. ఆరోగ్యవంతమైన చర్మం కోసం ముఖ్యంగా ప్రాసెస్ చేసిన ఆహారాలకు దూరంగా ఉండి, వీలైనంత శుభ్రంగా ఉండే ఆహారం తినండి. యాంటీఆక్సిడెంట్ మరియు కొల్లాజెన్ స్థాయిలు అధికంగా ఉండటానికి తాజా పండ్లు, కూరగాయలు మరియు డ్రై ఫ్రూట్స్ ను ఆహారంలో చేర్చండి. సన్ స్క్రీన్ లోషన్‌తో బ్యూటీ.. చర్మానికి సన్ స్క్రీన్ లోషన్ చాల ముఖ్యం. ఎండ ప్రభావం చర్మంపైన ఎక్కువగా ప్రసరిస్తుంది. అందువల్ల, వేసవిలో చర్మం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ, సవహించాలి. ఎండల వేడి చర్మం మీద ప్రసరించినప్పుడు చర్మం కందిపోయి నల్లగవడం, నల్లమచ్చలు రావడం, చర్మానికి ముడతలు ఏర్పడటం లాంటి సమస్యలు కలుగుతాయి.సన్‌ స్క్రీన్‌ లోషన్ చర్మానికి రాయడం వల్ల, ఇటువంటి ఇబ్బందుల నుంచి తప్పించుకోవచ్చు. ముఖం మీదే కాకుండా, ఎండతగిలే భాగాలకూ రాయాలి. మీ చర్మతత్వాన్ని బట్టి సన్‌స్క్రీన్ ఎంచుకోవాలి. సూర్యుని నుండి వెలువడే అతినీలలోహిత కిరణాలు చర్మానికి హానికలిగించకుండా, సన్‌స్క్రీన్ లోషన్ అడ్డుకుంటుంది. అందుకోసం ప్రతి రోజు చర్మానికి సన్ స్క్రీన్ లోషన్ ను రాయాలి. మీరు బయటికి వెళ్ళేటప్పుడు ప్రతిసారీ తప్పనిసరిగా సన్‌ స్క్రీన్‌ ను రాసుకోవాలి. బయటికి వెళ్ళడానికి 15 నిమిషాల ముందు క్రీమ్ ను రాసుకోవాలి. అయితే సన్ స్క్రీన్ లోషన్ ముఖం మీదే కాకుండా, ఎండతగిలే భాగాలకూ రాయాలి. హైడ్రేషన్.. చర్మాన్ని హైడ్రేషన్‌‌‌గా ఉంచటం చాలా మంచిది. ఈ విషయంలో మిగతా శరీరానికి చర్మానికి తేడా లేదు. నీళ్లు తాగటం వల్ల చర్మానికి తగినంత తేమ అందుతుంది. నీరు చర్మంలోని మలినాలను తొలగించి మొటిమలు రాకుండా నివారిస్తుంది. రోజుకి రెండు లీటర్ల నీరు తాగితే చర్మం బిగుతుగా, మృదువుగా, నునుపుగా తయారవుతుంది. చర్మం హైడ్రేట్ గా ఉంటే కాంతివంతంగా తయారవుతుంది. మరియు ఒక మంచి మాయిశ్చరైజింగ్ ను ఉపయోగించి చర్మంను ఎప్పుడూ తేమగా ఉంచుకోవాలి . అలా రెగ్యులర్ గా చేసినప్పుడు, చర్మం కాంతివంతంగా మారుతుంది. ఈ అలవాట్లకు దూరంగా ఉండండి.. మద్యపానం, ధూమపానం ఆరోగ్యానికే కాదు చర్మానికి కూడా హానికరం. వయస్సులో ఉన్నప్పుడు మీ చర్మం అందంగా కనిపించాలనుకుంటే, చెడు అలవాట్లను విడిచి పెట్టండి . మద్యం, ధూమపానం చర్మం వృద్దాప్యం అయ్యేందుకు రెండు ప్రధాన కారణాలు. పొగాకు వల్ల చర్మంలో రక్త ప్రవాహం తగ్గడంవల్ల ముడతలు వచ్చే అవకాశం ఎక్కువ. అదేవిదంగా మద్యపానం అతిగా తాగే వారిలో చర్మం పొడిబారుతుంది. అలా పొడిబారిన చర్మంలో ముడతలు ఎక్కువగా వస్తాయి. అందుకే అందమైన చర్మం కావాలంటే మద్యపానానికి , ధూమపానానికి దూరంగా ఉండండి. మంచి నిద్రతో మరింత అందం.. మంచి నిద్ర మీ చర్మ ఆరోగ్యానికి ఎంతో దోహదం చేస్తుంది. రాత్రి సమయం అనేది మీ చర్మం కోల్పోయిన జీవాన్ని తిరిగి పొందడానికి మరియు మెరిసేలా చేయడానికి ఒక మంచి సమయం గా చెప్పవచ్చు. ఈ కారణం వలనే ఎనిమిది గంటల పాటు నిద్రించడం ఆరోగ్యం మరియు చర్మానికి మంచిది. సరైన నిద్ర లేని వారి ముఖం నిర్జీవంగా మరియు బిగుసుకు పోయిన చర్మాన్ని కలిగి ఉంటారు. సాధారణంగా మన ఆరోగ్యం విషయానికి వస్తే మన జుట్టుకి ఎక్కువ నిద్ర ముఖ్యం. నిద్రపోవడం వల్ల కొల్లాజెన్ సహజంగా పెరుగుతుంది, దీని వల్ల మీ చర్మం మెరుస్తూ మరియు ఆరోగ్యంగా ఉంటుంది. నిద్ర సరిగా లేనివారిలో ముడతలు ఎక్కువగా కనిపిస్తాయి.


from Beauty Tips in Telugu: అందం చిట్కాలు, Homemade Natural Beauty Tips Telugu - Samayam Telugu https://ift.tt/38DVT4Y

No comments:

Post a Comment

'Overconfidence Caused Cong Defeat'

'Congress leaders are ready to lose the election and not form the government, but are never ready to share seats with others.' fro...