Wednesday, 25 December 2019

పూరీ జగన్నాథ్ కుమారుడి పేరుతో అమ్మాయిలకు వల

సినీ, క్రీడా సెలబ్రిటీలకు ఫేక్ సోషల్ మీడియా ఖాతాలే ఎక్కువ హాని చేస్తున్నాయి. ఫ్యాన్స్‌తో ముచ్చటించడానికి, విమర్శకులు తమ గురించి ఏం కామెంట్స్ చేస్తున్నారో తెలుసుకోవడానికి సెలబ్రిటీలకు ఉన్న ఏకైక ప్లాట్‌ఫాం సోషల్ మీడియా. ఓ రకంగా చెప్పాలంటే సోషల్ మీడియా సెలబ్రిటీలకు ఓ వరం లాంటిదే కాదు శాపం అని కూడా చెప్పాలి. ఎంత పాపులారిటీ తెచ్చిపెడుతుందో.. అంతకంటే ఎక్కువ సమస్యలు కూడా తెచ్చిపెడుతుంది. ఇప్పటికే సోషల్ మీడియాలో సెలబ్రిటీలపై ఫేక్ అకౌంట్స్ ఎక్కువైపోయాయి. ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేస్తే చేశారు. కానీ ఫలానా సెలబ్రిటీ పేరును వాడుకుని తప్పుడు పనులు చేస్తేనే అసలు సమస్య మొదలయ్యేది. ఇప్పుడు ఈ చర్చంతా ఎవరి గురించి అంటే.. ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ కుమారుడు గురించి. ఎవడో ఆకతాయి ఆకాశ్ పేరుతో ఫేక్ అకౌంట్ క్రియేట్ చేశాడు. అంతటితో ఆగాడా.. ఎందరో అమ్మాయిలకు ఫ్రెండ్ రిక్వెస్ట్‌లు పెట్టాడు. దాంతో కొందరు అమ్మాయిలు నిజంగానే ఆకాశ్ పూరీ ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపాడు అనుకుని చాటింగ్స్ చేయడం మొదలుపెట్టారు. అయితే ఓ అమ్మాయి మాత్రం తనతో చాట్ చేస్తోంది ఆకాశ్ కాదని ఎలాగోలా తెలుసుకుంది. ఇలా సెలబ్రిటీల పేరుతో ఫేక్ అకౌంట్స్ తెరిచి మోసం చేసేవారికి బుద్ధి చెప్పాలని నిర్ణయించుకుంది. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. READ ALSO: దాంతో వెంటనే స్పందించిన పోలీసులు వేగంగా దర్యాప్తు చేపట్టారు. ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసిన నిందితుడి నుంచి హార్డ్ డిస్క్, పెన్ డ్రైవ్స్ స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ వివాదం గురించి పూరీ జగన్నాథ్ కానీ ఆకాశ్ కానీ స్పందించలేదు. ఇక ఆకాశ్ విషయానికొస్తే.. ‘మెహబూబా’ సినిమాతో ప్రేక్షకులను మెప్పుపొందాడు. ఇప్పుడు ‘రొమాంటిక్’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. సినిమా పోస్టర్లు, పాటలు చాలా బోల్డ్‌గా ఉన్నాయి. ఈ సినిమా హిట్ అయితే.. ఇక ఆకాశ్‌తో సినిమా చేయడానికి వేరే దర్శకులు కూడా ముందుకొస్తారు. READ ALSO:


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/35YJkQa

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....