Sunday, 29 December 2019

నిర్మాతను బీరు బాటిల్‌తో కొట్టిన నటి సంజన?.. ఇదో చిల్లర ప్రచారం అంటోన్న హీరోయిన్!

సంజన గల్రానీ.. తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరంలేని పేరు. తరుణ్ ‘సోగ్గాడు’ సినిమాతో టాలీవుడ్‌కి పరిచయమైన ఈ కన్నడ బ్యూటీ ‘బుజ్జిగాడు’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. కన్నడలో వరుసపెట్టి సినిమాలు చేస్తోన్న సంజన.. తెలుగులో మాత్రం కనిపించింది చాలా తక్కువే. కిందటేడాది ‘దండుపాళ్యం 3’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఇదిలా ఉంటే, సంజన తాజాగా ఒక వివాదంలో చిక్కుకుంది. కన్నడ మహిళా నిర్మాత వందన జైన్‌ను సంజన బీర్ బాటిల్‌తో కొట్టిందనే వార్త హాట్ టాపిక్‌గా మారింది. డిసెంబర్ 24న బెంగళూరులోని ఓ ఫైవ్ స్టార్ హోటల్‌లో జరిగిన పార్టీలో సంజన తనను బీర్ బాటిల్‌తో కొట్టి గాయపరిచిందని పోలీసులకు వందన ఫిర్యాదు చేసింది. పార్టీలో తనకు, సంజనకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగిందని.. కోపంతో సంజన తనను బీర్ బాటిల్‌తో కొట్టిందని ఆ ఫిర్యాదులో వందన పేర్కొంది. దీంతో సంజనపై బోలెడన్ని వార్తలు వెలువడ్డాయి. అయితే, ఈ వార్తలపై సంజన తాజాగా స్పందించింది. తనపై వందన చేస్తోన్న ఆరోపణలన్నీ తప్పని.. ఆమె చిల్లర ప్రచారం చేసుకుంటోందని మండిపడింది. ఈ మేరకు ట్విట్టర్‌ ద్వారా మీడియాకు ఒక ప్రెస్ నోట్‌ను విడుదల చేసింది. ఈ ప్రెస్ నోట్‌లో ఆమె వెల్లడించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.. Also Read: ‘‘ఈ మధ్య నా గురించి వ్యాప్తి చెందుతున్న ప్రతి విషయం కేవలం తప్పుడు ప్రచారం మాత్రమే. ఎలాంటి ఆధారాలు లేకుండా ఆ మహిళ నాపై తప్పుడు ఆరోపణలు చేస్తోంది. ఆమె నన్ను, నా తల్లిని దారుణమైన పదజాలంతో తిట్టింది. నా కెరీర్‌ను నాశనం చేయడానికి, నన్ను జైలుకు పంపించడానికి, నా కుటుంబం పేరును నాశనం చేయడానికి ఆమె కుట్ర చేస్తోంది. ఆమె చౌకబారు మనిషి. ప్రచారం కోసం ఇలాంటి చౌకబారు ఆరోపణలు చేస్తోంది. ఆసలు ఆరోజు ఏం జరిగిందో ఆమెను వివరంగా అడిగి తెలుసుకోండి. నేను గత 10 సంవత్సరాలుగా సినిమాల్లో నటిస్తున్నాను. ప్రచారం కోసం నేను ఏనాడూ ఇలాంటి చిల్లర వేషాలు వేయలేదు. కానీ, ఆమె మాత్రం నన్ను అడ్డం పెట్టుకుని తనను తాను చిల్లర ప్రచారం చేసుకుంటోంది. మొబైల్ ఫోన్‌లో వీడియో చూపించి అసలు విషయాన్ని వక్రీకరించి చెబుతోంది. ఆమె చూపించే వీడియోలో ముఖానికి, తలకు ఏదైనా గాయం ఉందా? విరిగిపోయిన సీసాకైనా రక్తపు మరక ఉండాలి కదా. నేను నా జీవితంలో ఎప్పుడూ బాధ్యతా రాహిత్యంగా ప్రవర్తించలేదు. ఇది నాకు వ్యతిరేకంగా చేస్తోన్న నిరాధారమైన ఆరోపణ మాత్రమే. వచ్చే ఏడాదిలో నేను నాలుగు దక్షిణ భారత చిత్రాలు, ఒక హిందీ సినిమాలో నటించబోతున్నాను. వెబ్ ఫిల్మ్‌తో సహా నా చేతిలో ఇప్పుడు ఏడు సినిమాలు ఉన్నాయి. కాబట్టి, ఇలాంటి చిల్ల ప్రచారం చేసుకోవాల్సిన అవసరం నాకు లేదు. ఆమె తనను తాను నిర్మాతగా చెప్పుకుంటూ తప్పుడు ప్రచారం చేస్తోంది. నన్ను లక్ష్యంగా చేసుకుని ఆ తప్పుడు ప్రచారంలోకి లాగాలని చూస్తోంది. నాకు నిర్మాతలపై విపరీతమైన గౌరవం ఉంది. నేను దేవుణ్ణి నమ్ముతాను. ఆమె ఇంతకుముందు భారత క్రికెట్ స్పిన్ బౌలర్ అమిత్ మిశ్రాను వివాహం చేసుకోవడానికి ప్రయత్నించింది. కానీ సాధ్యపడలేదు. దీంతో ఆయనపై నిరాధారమైన ఆరోపణలు చేసింది. ఆయన్ని బ్లాక్ మెయిల్ చేసింది. ఆయన్ని భారత క్రికెట్ జట్టుకు దూరం చేయడంలో విజయవంతమైంది. ఇప్పుడు ఆమె వలలో నేను చిక్కుకున్నాను. దయచేసి ఆమె చేస్తోన్న నిరాధారమైన ఆరోపణలను నమ్మొద్దని, నన్ను రక్షించమని అభ్యర్థిస్తున్నాను. ఈ వివాదం ఇంకా కొనసాగాలని నేను కోరుకోవడంలేదు. ఈ పరిస్థితిలో నాకు, నా కుటుంబానికి పోలీసుల రక్షణ కావాలి. నాకు మద్దతు ఇచ్చిన బెంగళూరు నగర పోలీసులకు ఈ సందర్భంగా నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను’’ అని ప్రెస్ నోట్‌లో సంజన గల్రానీ పేర్కొన్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/367VaHY

No comments:

Post a Comment

'Paatal Lok Is Sacred To Me'

'I was feeding off the bond that Ansari and Hathiram had formed during season one.' from rediff Top Interviews https://ift.tt/k435...