Monday, 30 December 2019

బన్నీ ఫ్యాన్స్‌కు న్యూ ఇయర్‌ గిఫ్ట్‌.. సూపర్‌ హిట్‌ సాంగ్‌ వీడియో

ఈ ఏడాది బిగ్గెస్ట్ హిట్ సాధించిన పాటల్లో టాప్‌ లిస్ట్‌ లో ఉండే సాంగ్ `సామజవరగమన`. అల వైకుంఠపురములో సినిమాలోని ఈ పాట లిరికల్‌ వీడియో ఇప్పటికే 100 మిలియన్లకు పైగా వ్యూస్‌ సాధించిన రికార్డ్ సృష్టించింది. తమన్‌ సంగీత సారధ్యంలో సిద్ధ్‌ శ్రీరామ్‌ ఆలపించిన ఈ పాటకు సిరివెన్నెల సీతారామ శాస్త్రీ సాహిత్యమందించాడు. ఇప్పటికీ టాప్‌లో ట్రెండ్ అవుతున్న ఈ పాట వీడియో ప్రోమోను న్యూ ఇయర్‌ కానుకగా విడుదల చేశారు. 59 సెకన్ల నిడివితో రిలీజ్‌ అయిన ఈ ప్రోమో వావ్‌ అనిపించేలా ఉంది. పారిస్‌లోని అందమైన లోకేషన్‌లో ఈ పాటను చిత్రీకరించారు. బన్నీ స్టైలింగ్‌తో పాటు స్టైలిష్ డాన్స్‌ మూవ్స్‌ పాటకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. హీరోయిన్‌ పూజా హెగ్డే అందాలు మరింత గ్లామర్‌ను యాడ్‌ చేశాయి. Also Read: లాంగ్ గ్యాప్‌ తరువాత అల్లు అర్జున్‌ చేస్తున్న సినిమా కావటంతో ఈ మూవీపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. త్రివిక్రమ్‌ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను గీతా ఆర్ట్స్‌, హారికా హాసిని క్రియేషన్స్‌ బ్యానర్లపై అల్లు అరవింద్‌, రాధాకృష్ణలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో యంగ్ హీరో సుశాంత్‌, నివేదా పేతురాజ్‌, నవదీప్‌, టబు, జయరామ్‌లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమాతో నిరాశపరిచిన బన్నీ, ఈ సినిమాతో సూపర్‌ హిట్‌ కొట్టి తిరిగి ఫాంలోకి రావాలని ప్లాన్‌ చేస్తున్నాడు. అందుకు తగ్గట్టుగా ప్రమోషన్‌ కార్యక్రమాలను కూడా భారీగా ప్లాన్ చేస్తున్నారు. Also Read:


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2F8RLg0

No comments:

Post a Comment

'I Wanted Waheeda Rehman For Ankur'

'I don't think Waheeda had the confidence that I could pull it off, so she said no.' from rediff Top Interviews https://ift.tt...