Sunday, 29 December 2019

Rashmi Gautam ఎక్స్‌పోజింగ్‌కి మాత్రమే ఒప్పుకుంటోంది అందుకే సుధీర్‌ని..: దర్శకుడి సంచలన వ్యాఖ్యలు

‘జబర్దస్త్’ కామెడీ షోతో బాగా పాపులర్ అయిపోయారు రష్మి గౌతమ్, సుడిగాలి సుధీర్. వీరిద్దరి కెమిస్ట్రీకి విపరీతమైన క్రేజ్ ఉంది. వీరిద్దరూ కలిసి ఓ సినిమాలో నటిస్తే చూడాలని కోరుకుంటున్న అభిమానులు ఎందరో ఉన్నారనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అయితే ఆ అవకాశం ‘సాఫ్ట్‌వేర్ సుధీర్’ సినిమాతో రష్మీకి వచ్చింది. కానీ డేట్లు కుదరడంలేదు అన్న కారణంతో రష్మి సినిమాకు నో చెప్పిందట. ఈ విషయాన్ని సుధీర్ ఒకానొక సందర్భంలో తెలిపాడు. అయితే రష్మి ఈ సినిమాకు నో చెప్పడంపై ప్రముఖ దర్శకుడు ఇమంది రామారావు షాకింగ్ కామెంట్స్ చేశారు. ‘‘ఇక్కడ నేను నిజాలే మాట్లాడాలని అనుకుంటున్నాను. సినిమాకు రెమ్యునరేషన్‌గా రష్మి రూ.40 లక్షలు కావాలని అడిగింది. కానీ సినిమా యూనిట్ కేవలం 35 లక్షలు ఇస్తామని చెప్పింది. ఇందుకు రష్మి ఒప్పుకోలేదు. ఇది రష్మి జీవితంలో దురష్టకరమైన సంఘటన. దాదాపు ఏడెనిమిది ఏళ్లుగా రష్మి, సుధీర్ మధ్య మంచి ట్రాక్ నడుస్తోంది. వీరిద్దరూ ప్రేమించుకుంటున్నారో లేదో పక్కనబెడితే వీరిద్దరినీ అభిమానులు ఎంతో ప్రేమిస్తున్నారు. జబర్దస్త్‌లో రష్మి, సుధీర్ కలిసి ఎన్నో పాటలకు డ్యాన్స్‌లు చేశారు. ఒకవేళ రష్మి ‘సాఫ్ట్‌వేర్ సుధీర్’ సినిమాకు ఒప్పుకుని ఉంటే.. వీరిద్దరూ జబర్దస్త్‌ షోలో వేసిన డ్యాన్సులను ఈ సినిమాలో కూడా వేసి ఉంటే సినిమా సూపర్ హిట్ అయి ఉండేది. ప్రతీ ఆర్టిస్ట్ జీవితంలో ఓ చేంజ్ ఓవర్ అనేది ఉండాలి’’ READ ALSO: ‘‘ఇప్పటివరకు రష్మి చేసిన సినిమాల్లో ఏ సినిమా కూడా ఎందుకు సక్సెస్ అవ్వలేదు? ఎందుకంటే రష్మిలోని గ్లామర్‌ను చూపించడానికి అందరూ ఆమెను వాడుకున్నారు కానీ గ్రామర్‌ను చూసేందుకు ఎవ్వరూ ప్రయత్నించలేదు. అప్పుడెప్పుడో డబ్బులు లేక ఇబ్బందిపడిందని పెర్ఫామెన్స్‌కు స్కోప్ ఉన్న సినిమాను రెమ్యునరేషన్ ఇవ్వనందుకు వదులుకుంది. దీని వల్ల రష్మి ఇంకా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటుంది. ఒకవేళ ‘సాఫ్ట్‌వేర్ సుధీర్’ సినిమాలో రష్మి హీరోయిన్‌గా చేసి ఉంటే మరో సినిమాలో కోటి రూపాయలు రెమ్యునరేషన్ ఇస్తామనేవాళ్లేమో. ఇండస్ట్రీలో మార్కెట్ ఇలా ఉంది. ఎవరి వల్ల ఎంత వస్తోంది అని మాత్రమే ఆలోచించుకోవాలి. రష్మికి, సుధీర్‌కి బాగా సింక్ అయింది. ప్రేక్షకులకు వారి కాంబినేషన్ అంటే చాలా ఇష్టం’’ READ ALSO: ‘‘ ఆ రకంగా చూసుకుంటే ‘సాఫ్ట్‌వేర్ సుధీర్’ సినిమాకు రష్మి నో చెప్పి చాలా పెద్ద పొరపాటు చేసింది. నేను ఈ సినిమా చూశాను. హీరోయిన్ పాత్ర పెర్ఫామెన్స్‌కు స్కోప్ ఉంది. ఇందులో రష్మి నటించి ఉంటే.. రష్మికి ఇంతబాగా నటించడం వచ్చా అని ఆలోచించేవారు ఉంటారు. అంతేకానీ ‘గుంటూర్ టాకీస్’ లాంటి సినిమాలు ఎన్ని చేసినా ఏం లాభం? అది కాదు నటన అంటే. స్కిన్ షో చేస్తే పది మంది కుర్రాళ్లు చూసి ఆనందపడతారు కాబట్టి అందరూ చూడరు. మున్ముందు రష్మికి ఇలాంటి అవకాశాలు వస్తాయో రావో తెలీదు. స్కిన్ షో చేయడానికి, హీరోతో బుగ్గా బుగ్గా రాసుకోవడంలో కష్టమేముంది? అదే ఓ డైలాగ్ చెప్పి నలుగురి చేత శెభాష్ అనిపించుకోవడంలో కదా ఉంది గొప్పతనమంతా. సుధీర్ వల్ల ధన్యకు బాగా పాపులారిటీ వచ్చేసింది. రష్మి డబ్బు కోసమే ఆలోచించింది. రష్మి కూర్చుని పని చేసినా రోజుకు లక్ష సంపాదించేస్తుంది. అలాంటప్పుడు ఈ సమయంలో రష్మి ఇంకా డబ్బు కావాలని అనుకోకూడదు. ఇప్పుడు కెరీర్‌ని బిల్డ్ చేసుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం’’ అని వెల్లడించారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2rDRyhL

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....