తెలుగులో ‘అల్లరే అల్లరి’, ‘మెంటల్’ వంటి సినిమాలు తీసిన దర్శకుడు ఎస్కే బషీద్ పలు మీడియా వర్గాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తన గురించి లేని పోని వార్తలు రాస్తున్నారని మండిపడ్డారు. ఆ పత్రికలన్నింటిపై కేసులు వేస్తున్నానంటూ ప్రెస్ మీట్ పెట్టారు. ఈ గ్యాప్‌లో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్‌పై ఆయన సెటైర్ వేశారు. ‘‘నా గురించి ఏంటండీ ఈ వార్తలు. నేను ప్రజల నుంచి సొమ్ము తీసుకుని వారిని బురిడీ కొట్టించానట. నాకు పాతిక బ్యాంక్ ఖాతాలు ఉన్నాయట. కోట్లు సొమ్ము చేసుకుంటున్నానట. ఇవన్నీ ఈనాడు, సాక్షి, డెక్కన్ క్రానికల్ పత్రికలు రాసిన వార్తలు. నా గురించి ఎవరెవరు ఏం రాశారో అన్ని ఆధారాలు ఉన్నాయి. వీరందరిపై నేను హైకోర్టులో కేసు వేస్తున్నాను. ఈనాడులో నా ఫొటోలు వేసి ఈ హెడింగ్స్ ఏంటండి. ఈనాడు సంస్థను నడుపుతున్న రామోజీ రావు ఇవన్నీ చూస్తూ ఎలా ఊరుకుంటున్నారు. నాకంటే ఆయన ఇంకా బాగుంటారు కదా. ఆయన ఫొటోలు వేసుకోండి. నా గురించి ఎందుకు ఇలాంటి వార్తలు రాస్తారు. ఫలానా వ్యక్తి గురించి ఏదన్నా రాస్తున్నప్పుడు నిజానిజాలు తెలుసుకోవాలి కదా. నేనేమీ పవన్ కళ్యాణ్‌ని కాదు ఎవరెన్ని మాటలు అన్నా చూస్తూ కూర్చోవడానికి, నోర్మూసుకుని ఉండటానికి. అందరినీ హైకోర్టుకు లాగుతా’’ READ ALSO: ‘‘ ఈ పత్రికలన్నీ నా గురించి రాస్తున్నవి నిజమే అయినప్పుడు పోలీసులు ఈపాటికే నన్ను అరెస్ట్ చేయాలి కదా. కానీ తెలంగాణ పోలీసులు దేవుళ్లు. వాళ్లు నాపై వస్తున్నవన్నీ నిజమా కాదా అని తెలుసుకుని నాకు క్లీన్ చిట్ ఇచ్చారు. పోలీసులకే నాపై అనుమానం లేనప్పుడు మధ్యలో మీడియా వాళ్ల పెత్తనం ఏంటి? నేను 2005 నుంచి ప్రజల నుంచి సొమ్ము తీసుకుంటున్నట్లు సాక్షి వాళ్లు రాశారు. సాక్షి వచ్చిందే 2010లో. మా చేత ఛానెల్‌కు ప్రచారం కల్పించుకుని మా గురించే ఇలాంటివి రాస్తారా? నేను అన్ని కోట్లు డబ్బు తిన్నానని వచ్చి నిరూపించండి. మీరు రాసే వార్తల వల్ల నా బిజినెస్ దెబ్బ తినదా? నా కుటుంబంపై ప్రభావం చూపదా? నేను ముందు రామోజీ రావుపై రూ.20 కోట్ల పరువు నష్టం దావా వేస్తున్నా. నేను ఇప్పటివరకు ఐదు సినిమాలు చేశాను. ఆ సినిమాలను శాటిలైట్ రైట్స్‌కు కూడా అమ్మలేదు. అవసరం లేదు అనుకున్నా. నాకు ఒకరి నుంచి డబ్బులు తీసుకోవడం నచ్చదు’’ READ ALSO: ‘‘ అలాంటిది సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తానని అమ్మాయిల నుంచి డబ్బులు తీసుకున్నానని ఎలా రాస్తారు? నాకు ఏ మీడియాపైనా కోపం లేదు. కానీ లేనిపోనివి రాస్తుంటే చాలా బాధగా ఉంది. నా గురించి ఎవరెవరు ఏం రాశారో వారంతా కోర్టుకు వచ్చి సమాధానం చెప్పాలి. నా గురించి ఇలా రాస్తున్న మీడియా వాళ్లకు నాపై కోపం ఉంటే చెప్పండి. నేను నా ఫ్యామిలీని తీసుకుని ఎక్కడికైనా వెళ్లిపోతాను. మొత్తంగా నేను ఒక్కటే చెప్తున్నాను. ఇక మీదట ఇలాంటి వార్తలు రాసేవారు కాస్త క్రాస్ చెక్ చేసుకోండి. నా గురించి రాసిన వారిపై కేసులు పెడుతున్నాను. వారంతా వచ్చి సమాధానం చెప్పాలి. ఎంత ఖర్చైనా ఫర్వాలేదు. రేపటి నుంచి నేను ఇదే పని మీద ఉంటాను. ఎందుకంటే ఇలా మరొకరికి జరగకూడదు’’ అంటూ ఫైర్ అయ్యారు బషీద్.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2St57vp
No comments:
Post a Comment